Moviesటిక్‌టాక్ దుర్గారావు ఈ క్రేజ్ రావ‌డానికి కార‌ణం ఆ జ‌బ‌ర్ద‌స్త్ ఆర్టిస్టే..!

టిక్‌టాక్ దుర్గారావు ఈ క్రేజ్ రావ‌డానికి కార‌ణం ఆ జ‌బ‌ర్ద‌స్త్ ఆర్టిస్టే..!

చాలా త‌క్కువ టైంలోనే టిక్‌టాక్ నుంచి తెలుగు బుల్లితెర‌పై ఎంట్రీ ఇచ్చి కోట్లాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్న ఘ‌న‌త టిక్ టాక్ దుర్గారావుది. టిక్ టాక్ యాప్‌లో దుర్గారావు చేసిన డ్యాన్సుల‌కు వ‌చ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక్క‌డ వ‌చ్చిన పాపులారిటీతోనే ఆయ‌న్ను బుల్లితెర‌పై షోలు చేసే వ‌ర‌కు తీసుకు వెళ్లింది. దుర్గారావుతో పాటు అత‌డి భార్య కూడా చేసే ప‌న్నీ వీడియోలు మామూలుగా వినోదం పంచ‌వు.

ఇక దుర్గారావును జ‌బ‌ర్ద‌స్త్‌లో సుడిగాలి సుధీర్ చాలా ఎంక‌రేజ్ చేసేవాడ‌ట‌. ఆయ‌న ప్రోత్సాహంతోనే తాను ఎంతో క‌ష్ట‌ప‌డి.. ఈ స్థాయికి వ‌చ్చానని దుర్గారావు చెపుతూ ఉంటాడు. ఎక్క‌డ అయినా కూడా సుధీర్ ఆయ‌న‌కు ఛాన్స్ ఇవ్వండి.. మంచి పెర్పామెన్స్ ఇస్తాడంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌ను ఎంక‌రేజ్ చేస్తాడంటూ సుధీర్ ప‌ట్ల త‌న‌కు ఉన్న కృత‌జ్ఞ‌తా భావాన్ని చాటుకుంటాడు.

తాను కేరోవేన్‌లోకి వెళ్ల‌గానే సార్ అంటూ అప్యాయంగా ప‌ల‌క‌రించ‌డంతో పాటు త‌న‌ను, త‌న భార్య త‌ల్లిదండ్రులుగా చూసుకుంటాడ‌ని దుర్గారావు చెప్పాడు. తెలుగు బిగ్‌బాస్ 5వ సీజ‌న్లో హౌస్‌లో ఉన్న యాంక‌ర్ ర‌వికి తాము స‌పోర్ట్ చేస్తామ‌న్నాడు. ఏ షోకు వెళ్లినా కూడా ర‌వి త‌మ‌ను బాగా రిసీవ్ చేసుకుని.. గౌర‌విస్తాడ‌ని చెప్పారు.

ఇక టిక్‌టాక్ బ్యాన్ కావ‌డంతో ఇన్‌స్టాలో రీల్స్ చేస్తున్నామ‌ని.. ఇవి ల‌క్ష‌లాది మందిని అల‌రిస్తున్నాయ‌ని దుర్గారావు చెప్పాడు. ఇక త‌న అభిమానులు అంద‌రూ బిగ్‌బాస్‌లో ర‌వికే స‌పోర్ట్ చేయాల‌ని దుర్గారావు విజ్ఞ‌ప్తి చేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news