Moviesప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..ఎందుకంటే..?

ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..ఎందుకంటే..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీలతో దూసుకుపోతున్నారు. ఇక బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ప్ర‌భాస్ అక్టోబ‌ర్ 23న పుట్టిన‌రోజు వేడుక‌ల‌కు ముస్తాబవుతున్నాడు. ప్ర‌భాస్ అభిమానులు సోష‌ల్‌మీడియాలో ప్ర‌త్యేకంగా రూపొందించిన సీడీపీల‌తో ప్ర‌భాస్ పుట్టిన‌రోజు జ‌రిపేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ పెట్టిన ట్వీట్ అందరిని అట్రాక్ట్ చేస్తుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే పాన్-ఇండియా రొమాంటిక్ డ్రామా “రాధే శ్యామ్”. ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా టీజర్ అక్టోబర్ 23 న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు మన డార్లింగ్. “విక్రమాదిత్య ఎవరు? అక్టోబర్ 23 న ‘రాధేశ్యామ్’ టీజర్ లో తెలుసుకోవడానికి వేచి ఉండండి! టీజర్‌ను ఇంగ్లీష్ తో పాటు బహు భాషల్లో ఉపశీర్షికలతో ఆస్వాదించండి” అని ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా యూర‌ప్ నేప‌థ్యంలో పున‌ర్జ‌న‌ల క‌థ ఆధారంగా తెర‌కెక్కుతోంద‌ట‌. పూజాహెగ్డే ప్ర‌భాస్ ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం 2022 జనవరి 14న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదల కానున్న అన్ని సినిమాలు దూకుడుగా సినిమా ప్రమోషన్లు చేస్తుంటే ‘రాధేశ్యామ్’ టీం మాత్రం సైలెంట్ గా ఉంది. కానీ తాజాగా విడుదల చేసిన అప్డేట్ తో రెబల్ స్టార్ అభిమానులు సంతోషంగా ఉన్నారు.

 

 

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news