Moviesపవన్ షాకింగ్ డెసిషన్..జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు..ఇంత సడెన్ గానా..??

పవన్ షాకింగ్ డెసిషన్..జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు..ఇంత సడెన్ గానా..??

అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు పవన్ కళ్యాణ్ కి భక్తులు ఉంటారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన పవన్ కళ్యాణ్ ఇమేజ్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. అన్నయ్య చిరంజీవి వారసుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన పవన్, తన మార్కు మేనరిజం, హీరోయిజంతో స్టార్ గా ఎదిగాడు. అయితే ఆయనకు ప్రజాసేవ అంటే ఇష్టం. ఈ కారణంతోనే ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలోకి వచ్చారు.

ఇక ఆ టైంలో అటు సినిమాలు ఇటు రాజకీయాలు చూసుకోలేక సినిమాలకు గుడ్ బై చెప్పేసారు. అయితే కొంత కాలం తరువాత అర్ధిక ఇబ్బందుల కారణంగా మళ్లీ సినిమా లో కి వచ్చాడు పవన్. పవర్ ఫుల్ కం బ్యాక్ తో వకిల్ సాబ్ అనే రీమేక్ చిత్రంతో తనదైన స్టైల్లో నటించి మరోసారి తన పవర్ ఏంటో అందరికి తెలిసేలా చేసాడు ఈ కాటమరాడు. అయితే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు పవన్ మళ్లి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టనున్నాడట.

ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో చాలా చురుకుగా ఉన్నారు. ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో విన్పిస్తున్న టాక్ ప్రకారం పవన్ ఇకపై సినిమాలకు సంతకం చేయకూడదని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్నారు. 2023 నుంచి రాబోయే ఎన్నికలపై దృష్టి సారించాలని భావిస్తున్నారట. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు తో పాటు యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర తో కలిసి భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నారు. రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అవి పూర్తికాగానే హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగంత్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటారు. మరి ఆ తర్వాత సినిమాలు కొనసాగిస్తారా? అంటే లేదనే సమాచారం అందుతోంది. మరి చుడాలి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news