Moviesఅన్నయ్యకు అద్దిరిపోయే విధంగా మహేష్ బాబు స్పెషల్ విషేస్..!!

అన్నయ్యకు అద్దిరిపోయే విధంగా మహేష్ బాబు స్పెషల్ విషేస్..!!

తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఆయనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఎటువంటి గొడవలకు పోకుండా..ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా.. సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటాడు ఈ ఘట్టమనేని వారసుడు. ఇక మహేష్ బాబు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన ట్వీట్టర్ వేదికగా వాళ్ల అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడు అనగానే మహేష్ గుర్తుకొస్తారు. అయితే మహేష్ కంటే ముందే హీరో అయ్యారు రమేష్ బాబు. కానీ అతడు పరిమితంగానే సినిమాలు చేసి ఈ రంగం నుంచి ఎగ్జిట్ అయ్యారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కొనసాగారు.

రమేష్ బాబు పుట్టినరోజు సంధ్ర్భంగా.. మహేష్ తన సోదరుడికి శుభాకాంక్షలు తెలిపారు. నాటి క్లాసిక్ మూవీలో అన్నయ్య రమేష్ తో కలిసి నటిస్తున్నప్పటి స్టిల్ ఒకటి షేర్ చేశారు. “ఇక్కడ నా అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు గొప్ప ఆరోగ్యం.. చాలా ఆనందం దక్కాలని కోరుకుంటున్నాను” అని మహేష్ ట్వీట్ చేశారు.బాల నటుడిగా మహేష్ రమేష్ హీరోగా నటించిన చిత్రంలో కనిపించారు. మహేష్ తన సోదరుడు రమేష్ బాబు బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పడం ఆసక్తికరంగా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news