Moviesసుమంత్ - కీర్తిరెడ్డి విడాకుల‌కు ఆ చిన్న కార‌ణ‌మేనా ?

సుమంత్ – కీర్తిరెడ్డి విడాకుల‌కు ఆ చిన్న కార‌ణ‌మేనా ?

అక్కినేని మ‌న‌వ‌డు నాగ‌చైత‌న్య – స్టార్ హీరోయిన్ స‌మంత విడాకుల వ్య‌వ‌హారం ఇప్పుడు మీడియాలోనూ, సోష‌ల్ మీడియాలోనూ ఎంత హాట్ టాపిక్‌గా మారిందో చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలోనే అక్కినేని ఫ్యామిలీకి పెళ్లి అనే ప‌దం క‌లిసి రాలేద‌న్న చ‌ర్చ‌లు కూడా ఇప్పుడు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఎందుకంటే నాగార్జున‌, చైతు, సుమంత్‌, సుప్రియ‌కు తొలి పెళ్లి క‌లిసి రాలేదు. ఇక అఖిల్‌కు కూడా తొలిసారి ఎంగేజ్‌మెంట్ జ‌రిగాక క్యాన్సిల్ అయ్యింది.

ఇక ఏఎన్నార్ మ‌న‌వ‌డు ( కుమార్తె కొడుకు) అయిన యార్ల‌గ‌డ్డ సుమంత్ రాంగోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ప్రేమ‌క‌థ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. సుమంత్‌కు అడ‌పా ద‌డ‌పా ఎప్పుడు అయినా ఒక హిట్ రావ‌డ‌మే కాని.. అత‌డు హీరోగా నిల‌దొక్కుకోలేదు. ఈ క్ర‌మంలోనే అప్ప‌టికే క్రేజీ హీరోయిన్‌గా ఉన్న కీర్తిరెడ్డితో ప్రేమ‌లో ప‌డి ఆమెను పెళ్లాడాడు. కీర్తిరెడ్డికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో తిరుగులేని స్టార్‌డ‌మ్ వ‌చ్చింది.

కీర్తి నాగార్జున ప‌క్క‌న రావోచి చంద‌మామ సినిమా కూడా చేసింది. 2004లో పెళ్లి చేసుకున్న ఈ జంట యేడాదికే మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో 2005లో విడిపోయింది. వీరి గ్యాప్‌కు ప్ర‌ధానంగా ఒక్క‌టే కార‌ణ‌మ‌ట‌. కీర్తిరెడ్డిది నిజామాబాద్ జిల్లాకు చెందిన పొలిటిక‌ల్ ఫ్యామిలీ. ఆమె తాత గంగారెడ్డి నిజామాబాద్ ఎంపీగా కూడా ప‌నిచేశారు. ఆమె కుటుంబానికి అమెరికాలో కోట్లాది రూపాయ‌ల వ్యాపారాలు ఉన్నాయి.

హైద‌రాబాద్ నుంచి వ‌చ్చేసి అక్క‌డ సెటిల్ అయ్యి.. ఆ వ్యాపారాలు చూసుకోవాల‌ని కీర్తి కండీష‌న్ పెట్టింది. అయితే సుమంత్ మాత్రం త‌న ఫ్యామిలీకి తెలుగు సినిమా రంగంలో ఎంతో పేరు ఉంద‌ని.. ఇక్క‌డ వ‌దుల‌కుని నేను రానని చెప్పాడ‌ట‌. చివ‌ర‌కు ఇదే ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్‌కు కార‌ణ‌మై వారు విడిపోయే వ‌ర‌కు వెళ్లింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news