Moviesవ‌ద‌ల‌ను... విడాకులిచ్చిన రెండో రోజే తేల్చేసిన స‌మంత‌..!

వ‌ద‌ల‌ను… విడాకులిచ్చిన రెండో రోజే తేల్చేసిన స‌మంత‌..!

తెలుగు .. తమిళ భాషల్లో సమంత స్టార్ హీరోయిన్‌గా ప‌దేళ్ల పాటు ఓ వెలుగు వెలిగింది. ఆమె హీరోయిన్‌గా ఎంత స‌క్సెస్ అయ్యిందో.. ఎన్ని హిట్లు కొట్టిందే మ‌న‌మంద‌రం చూస్తూనే ఉన్నాం. ఇక చైతు ఆమెకు భ‌ర్త‌గా దొర‌క‌డం కూడా చాలా అదృష్టం. ఇప్పుడిప్పుడే ఆమెకు అవ‌కాశాలు త‌గ్గుతున్నాయి. స‌రైన టైంలోనే ఆమె పెళ్లి కూడా చేసుకుంది. పెళ్ల‌య్యాక కూడా ఆమె న‌ట‌న‌కు ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లే ఎంచుకుంటూ మంచి సినిమాలు చేసి మ‌రీ హిట్ కొట్టింది.

అయితే ఆమెకు ఆ హిట్లు చాల‌లేదు. ఈ గ్లామ‌ర్ ప్ర‌పంచంలో మ‌రింత కాలం.. గ్లామ‌ర్‌గా వెల‌గాల‌న్న ఆమె కోరిక త‌గ్గ‌లేదు స‌రిక‌దా.. మ‌రింత ఎక్కువైంది. ఈ క్ర‌మంలోనే ఆమె మ‌రింత హాట్ గా రెచ్చిపోతూ వ‌చ్చింది. ఎవ‌రైనా పెళ్ల‌య్యాక ప్యామిలీ మ్యాన్ 2 లాంటి వెబ్‌సీరిస్ లో అంత బోల్డ్‌గా ఉంటారా ? తాను సినిమా ఇండ‌స్ట్రీలో ఎంతో సంప్ర‌దాయ‌మైన కుటుంబంలో ఓ కోడ‌లిని.. ఓ హీరో భార్య‌ను అన్న విష‌మం ఆమె మ‌ర్చిపోయింది.

 

ఆమె మ‌రింత హాట్‌గా ఉండాల‌నుకుంది.. అలాగే సినిమాల్లో కూడా రెచ్చిపోవాల‌నుకుంది. అయితే అందుకు సంప్ర‌దాయాలు, కండీష‌న్లు అడ్డు వ‌చ్చాయి. చివ‌ర‌కు విడాకులు తీసుకుంది. ఇక చైతుతో విడాకులు తీసుకున్నాక ఆమె మ‌రింత‌గా త‌న కెరీర్‌పై కాన్‌సంట్రేష‌న్ చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆమె కోలీవుడ్‌లో విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో న‌య‌న‌తార‌తో క‌లిసి ఓ సినిమా చేస్తోంది.

తెలుగులో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంతలం చేస్తోంది. ఇక‌పై ఆమె మ‌ళ్లీ వ‌రుస పెట్టి సినిమాలు చేసేందుకు సిద్ధ‌మ‌వుతుంద‌ని ఆమె స‌న్నిహితులు చెపుతున్నారు. ఆమె కోరిక ఎలా ? ఉన్నా పాత పామ్‌ను అందుకుని మ‌ళ్లీ స్టార్ స్టేట‌స్ ఎంత వ‌ర‌కు ద‌క్కించుకుంటుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news