Moviesచైతుకు విడాకులిచ్చిన రెండు రోజుల‌కే స‌మంత‌లో ఎంత మార్పు ...!

చైతుకు విడాకులిచ్చిన రెండు రోజుల‌కే స‌మంత‌లో ఎంత మార్పు …!

అక్కినేని నాగచైతన్యతో సుదీర్ఘ ప్రేమాయణం న‌డిపిన స‌మంత ఎట్ట‌కేల‌కు నాలుగేళ్ల క్రితం అత‌డితో మూడు ముళ్లు వేయించుకుంది. మ‌రో నాలుగు రోజుల్లో వీరి వైవాహిక బంధం నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంటోన్న క్ర‌మంలోనే వీరిద్ద‌రు సంయుక్తంగా విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేసి అంద‌రికి షాక్ ఇచ్చారు. అయితే చైతుకు విడాకులు ఇచ్చిన‌ట్టు చెప్పిన రెండు రోజుల‌కే ఆమె తీరు పూర్తిగా మారిపోయింది.

చైతుతో పెళ్ల‌యిన వెంట‌నే స‌మంత త‌న ట్విట్ట‌ర్ అక్కౌంట్‌లో స‌మంతా పేరుకు ముందు అక్కినేని యాడ్ చేసుకుని అంద‌రి మ‌న‌స్సులు గెలుచుకుంది. చై, సామ్ దంపతులు సౌత్‌లోనే టాప్ రొమాంటిక్ క‌ఫుల్‌గా పేరొందారు. ఇక వీరి మ‌ధ్య గ్యాప్ స్టార్ట్ అయ్యాక అక్కినేని అనే స‌ర్ నేమ్ తీసేసింది.

ఇక‌నిన్న చైతుతో విడాకుల ప్ర‌క‌ట‌న చేశాక ఆమె అక్కౌంట్‌లో మ‌ళ్లీ మారో మార్పు క‌న‌ప‌డింది. ఎస్ అనే అక్ష‌రంతో ఉన్న ఆమె ట్విట్ట‌ర్ అక్కౌంట్‌ను స‌మంతా అనే పేరుతో మార్చేసుకుంది. మొత్తంగా సామ్ సోష‌ల్ మీడియాలో ఇంత వేగంగా చేసిన మార్పులు కూడా ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

ఓవ‌రాల్‌గా ఆమె అక్కినేని అన్న ప‌దం తొలగించిన‌ప్పటి నుంచే చైతుతో త‌న‌కు ఉన్న విబేధాల‌ను ప‌రోక్షంగా ప్ర‌స్తావించేలా బిహేవ్ చేస్తూ వ‌చ్చింది. ఇక ఇప్పుడు వాటిని నిజం చేస్తూ విడాకులు ఇవ్వ‌డంతో పాటు ఆ వెంట‌నే సోష‌ల్ మీడియా అక్కౌంట్ల‌లో పేర్ల‌ను కూడా మార్చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news