Moviesఅక్కినేని ఫ్యామిలీ కోసం స‌మంత ఎన్ని త్యాగాలు చేసిందో తెలుసా..?

అక్కినేని ఫ్యామిలీ కోసం స‌మంత ఎన్ని త్యాగాలు చేసిందో తెలుసా..?

నాగ చైతన్య-సమంత .. వాళ్ళ అభిమానులకి ఒక్కసారిగా ఊహించని షాక్ ఇచ్చింది ఈ జంట. నిప్పు లేనిదే పొగ రాదు..అన్నట్లుగా..మీడియాలో వచ్చిన మాటలనే నిజం చేస్తూ..గుండె పగిలె వార్తను చాలా సింపుల్ గా..కూల్ గా ఓ పోస్ట్ పెట్టి తమ 4 ఏళ్ళ వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేసేసారు. అప్పటి నుండి ఎంతో ముచ్చట గా ఉన్న ఈ జంట ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.

అయితే, విరు విడాకుల కి ప్రధమ కారణం సమంత పద్దతి నచ్చకపోవడమే అని వార్తలు హల్ చల్ చేసాయి. కొందరు ఏమో ఆమెకు తన పరసన్ల్ స్టైలిష్ట్ తో అఫైర్ ఉందని..అందుకే విడిపోయారని అంటుంటే..మరి కొందరు ఏమో లేదు లేదు సమంత ది ఫ్యామిలి మ్యాన్ వెబ్ సిరీస్ లో కొంచెం బోల్డ్ గా నటించింది కదా..అందుకే ఇక అలాంతి సినిమాలు తీయద్దు అన్నందుకు సమంతకు కోపం వచ్చి..చై కి దూరంగా ఉంటుంది..ఈ క్రమంలో అవి డైవర్స్ వరకు వెళ్లాయి అని మరి కొందరు అంటున్నారు.

ఈ ఊహాగానాలు చాలవు అన్నట్లు కొత్తగా సమంత పిల్లలను కనడానికి ఇష్టపడలేదు అందుకే అక్కినేని ఫ్యామిలీ ఇలా చేసింది అంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సమంత సన్నిహితులు ఈ రూమర్స్ పై స్పందిస్తున్నారు. అసలు సమంత్ అక్కినేని ఫ్యామిలీ కోసం ఎన్ని త్యాగాలు చేసిందో మీకు తెలుసా..? అంటూ మండిపడుతున్నారట.

నిజానికి సమంతకు పిల్లలు అంటే చాలా ఇష్టమట. అందుకే త్వరగా పిల్లలను ప్లాన్ చేసుకుందాం అనుకుంటే..అప్పట్లో నాగ చైతన్య కెరీర్ అంత మంచిగా లేదు అని కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నారట.. తీరా పిల్లలను కనడానికి అన్నీ ప్లాన్ చేసుకున్న టైంలో వీరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారట. సమంతకు మంచి మంచి బడా ఆఫర్లు వచ్చినా కూడా ఆమె పిల్లలను ప్లాన్ చేసుకుంటున్నాం నేను సినిమాలు చేయను అని తెగేసి చెప్పిందట. నిజానికి బాలీవుడ్ నుండి షారుఖ్ హీరోగా అట్లీ డైరెక్షన్ చేస్తున్న సినిమా నుండి సామ్ కి ఓ ఆఫర్ వచ్చింది. ఈ సినిమా ప్రపోజల్ ని కూడా పిల్లల కోసమే వద్దనుకుందని ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news