Gossipsచిరంజీవి కోసం డాషింగ్ డైరెక్టర్ మైండ్ బ్లాకింగ్ డెసిషన్..మరి ఆ పెద్దాయన...

చిరంజీవి కోసం డాషింగ్ డైరెక్టర్ మైండ్ బ్లాకింగ్ డెసిషన్..మరి ఆ పెద్దాయన ఒప్పుకుంటాడా..??

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళం లో సూపర్ హిట్ సాధించిన లూసీ ఫర్ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా వ‌స్తోంది. ఈ సినిమా కోసం తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు సహా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని చోట్లా దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దీన్నే ‘గాడ్ ఫాదర్’గా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే షురూ అయింది.

ఈ సినిమా మొదలైనప్పటి నుండి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మార్తుంది. ఇక స్టార్టింగ్ లో ఈ సినిమా ఒరిజిన‌ల్ వెర్ష‌న్ లో పృథ్విరాజ్ సుకుమార‌న్ చేసిన పాత్ర కోసం ..బాలీవుడ్ కండల వీరుడు ..స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఓకే చెప్పారని..నో చెప్పారని..మళ్లీ ఓకే చెప్పారని ఫుల్ హంగామ నడిచింది. ఇక ఆ తరువాత ఈ సినిమాలో సీనియర్ నటి కుష్భూ ఓ కీలక పాత్రలో నటిస్తుందన్నారు. ఇక నిన్నటి రోజు చిరంజీవికి తల్లి యుటూబర్ గంగవ్వ నటిస్తుందనే వార్త వైరల్ మారింది.

ఇక తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అది ఏమిటంటే.. గాడ్ ఫాదర్ సినిమాకి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ స్క్రిప్టులో సాయం చేస్తున్నారట. నిజానికి ఈ సినిమా రీమేక్ విషయంలో మొదటి నుండిలో మెగాస్టార్ సంతృప్తిగా లేరని వార్తలువస్తూనే ఉన్నాయి. అయితే.. కొన్ని చోట్ల హీరో ఎలివేషన్స్ మీద ఇంకా ఏదో కావాలనుకున్న చిరు పూరితో మార్పులు చేయిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కాగా ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news