Moviesభువనేశ్వ‌రి ఆంటీ ఇంత కిలాడీయా... ఆమెపై ఇన్ని కేసులు, కాంట్ర‌వ‌ర్సీలు ఉన్నాయా..!

భువనేశ్వ‌రి ఆంటీ ఇంత కిలాడీయా… ఆమెపై ఇన్ని కేసులు, కాంట్ర‌వ‌ర్సీలు ఉన్నాయా..!

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకే చెందిన భువ‌నేశ్వ‌రి… భువ‌నేశ్వ‌రి ఆంటీగా ప్ర‌సిద్ధి. ఆమెది విశాఖ‌జిల్లాలోని చోడ‌వ‌రం. ఆమె ఇద్ద‌రు సోద‌రులు రాజ‌కీయాల్లో ఉన్నారు. ఓ సోద‌రుడు రామానాయుడు మాడుగుల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. గ‌త ఎన్నిక‌ల‌లో అయితే ఓ సోద‌రుడు టీడీపీ నుంచి, మ‌రో సోద‌రుడు జ‌న‌సేన నుంచి పోటీ చేశారు. అయితే వీరిద్ద‌రు అక్క‌డ ఓడిపోగా… వైసీపీ విజ‌యం సాధించింది. ఇక భువ‌నేశ్వ‌రి తెలుగుతో పాటు ప‌లు భాష‌ల్లోనూ న‌టించింది. ఆమె చేసిన‌వి అన్నీ కూడా ఎక్కువుగా మ‌సాలా పాత్ర‌లే.

భువ‌నేశ్వ‌రీ ఆంటీ సినిమాలో ఉందంటే హాట్ హాట్ సీన్లు ఉండాల్సిందే.. అవి పండాల్సిందే..! ఆమెను తెర‌మీద చూస్తుంటే కుర్ర‌కారుకు మామూలు కిక్‌రాదుగా..! అయితే ఆమె వ్య‌క్తిగ‌త జీవితంలో అనేక ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. మోడ‌ల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె, బుల్లితెర‌పై కూడా ప‌లు సీరియ‌ల్స్‌, ప్రోగ్రామ్స్‌లో సంద‌డి చేశారు. ఆమె ప‌లు సినిమాల‌లో వేశ్య‌గా న‌టించారు. అయితే ఆమె నిజ‌జీవితంలో కూడా వ్య‌భిచారం చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. ఆమెపై ఈ త‌ర‌హా కేసులు ఉన్నాయి.

ఇటీవ‌ల ఆమె వెండితెర‌కు దూర‌మైంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిన ఆమె ఆ త‌ర్వాత ఎక్క‌డా యాక్టివ్‌గా క‌న‌ప‌డ‌డం లేదు. ఇక భువ‌నేశ్వ‌రి కుమారుడు మిథున్ శ్రీనివాస‌న్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌యం అయిన ఓ అమ్మాయిని ప్రేమించాల‌ని.. పెళ్లి చేసుకుంటాన‌ని ఓ మెడిక‌ల్ కాలేజ్ విద్యార్థినిని వేధించ‌డంతో పాటు ఆమె ఒప్పుకోకోపోవ‌డంతో ఆమె ఇంటికి వెళ్లి మ‌రీ గొడ‌వ చేశాడ‌న్న కార‌ణంతో పోలీసులు అత‌డిని అరెస్టు చేశారు.

ఇక మ‌రో టాక్ కూడా ఉంది. ఆమె ఇంట్లో ప‌నిచేసేందుకు శ్రీలంక నుంచి ఓ యువ‌తిని ర‌ప్పించి ఆమెతోనే త‌న కుమారుడి పెళ్లి భువ‌నేశ్వ‌రి చేసింద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. విచిత్రం ఏంటంటే ఆమె త‌న భ‌ర్త‌తో క‌లిసి త‌న అత్త భువ‌నేశ్వ‌రిపైనే వేధింపుల కేసు పెట్టింద‌న్న ప్ర‌చారం కూడా ఉంది. ఏదేమైనా త‌న హాట్ హాట్ పాత్ర‌ల‌తో ఎంతో మందిని మెప్పించిన భువ‌నేశ్వ‌రి ఆంటీ కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు. లేక‌పోతే ఆమె కెరీర్ మ‌రో రేంజ్లో ఉండేది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news