Moviesత‌మ్ముడు సినిమా ఫంక్ష‌న్లో స‌మంత‌కు చైతు చుర‌క‌లు..!

త‌మ్ముడు సినిమా ఫంక్ష‌న్లో స‌మంత‌కు చైతు చుర‌క‌లు..!

అక్కినేని నాగ‌చైత‌న్య ఇప్పుడు ఫుల్ రిలాక్స్ అయిపోయాడు. రెండు నెల‌లుగా విడాకులు తీసుకుంటోన్న నేప‌థ్యంలో చైతు తీవ్ర‌మైన మానసిక సంఘ‌ర్ష‌ణ‌కు గుర‌య్యాడు. స‌మంత‌ను క‌న్విన్స్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. చివ‌ర‌కు ఆమెతో విడాకులు తీసుకోవ‌డంతో ఇప్పుడు ఆ భారం అంతా దిగిపోయిన‌ట్టే ఉంది. క‌ట్ చేస్తే ఇప్పుడు చైతు వ‌రుస‌గా త‌న సినిమాలు ప‌ట్టాలెక్కించే ప‌నిలో బిజీగా ఉన్నాడు.

ఇక త‌మ్ముడు అఖిల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఆరేళ్లు అవుతోంది. ఇప్ప‌ట‌కీ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వ‌లేదు. అయితే ఇప్పుడు అఖిల్ ఆశ‌లు అన్నీ ఈ నెల 15న వ‌స్తోన్న మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ మీదే ఉన్నాయి. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా చైతు హాజ‌రైన విష‌యం తెలిసిందే.

అయితే స్పీచ్ ప్రారంభంలో చైతు మ‌నుషులు మారిపోతున్నారు.. ప‌రిస్థితులు కూడా మారిపోతున్నాయ్‌.. కానీ అక్కినేని అభిమానులు మాత్రం ఎప్ప‌ట‌కీ ఎన‌ర్జిటిక్‌గానే ఉంటున్నార‌ని చెప్పాడు. ఈ మ‌నుష్యులు.. ప‌రిస్థితులు మారిపోతున్నాయ్ అని చైతు స‌మంత‌ను ఉద్దేశించే అన్నాడ‌ని కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. ఇది ఆమెను టార్గెట్‌గా చేసుకుని వేసిన చుర‌కే అంటున్నారు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఇదే హైలెట్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news