Moviesయంగ్ లుక్ లో అదరగొడుతున్న బాలయ్య ..పార్టీ మూడ్‌ లో ఫుల్...

యంగ్ లుక్ లో అదరగొడుతున్న బాలయ్య ..పార్టీ మూడ్‌ లో ఫుల్ జోష్..!!

మాస్ ఆడియన్స్ టార్గెట్‌గా బోయపాటి శ్రీను- నందమూరి బాలకృష్ణ మరోసారి రంగంలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. ”సింహా, లెజెండ్” సినిమాతో భారీ హిట్స్ రాబట్టిన ఈ క్రేజీ కాంబో ఈ సారి ‘అఖండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో మాస్ కిక్కుతో పాటు రొమాంటిక్ ట్రీట్ ఉండేలా బోయపాటి ప్లాన్ చేసుకున్నారట. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది.

క్రేజీ కాంబోలో వస్తున్న ‘అఖండ’ మూవీ కోసం నందమూరి బాలకృష్ణ ఎన్నో సాహసాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన ఏకంగా అఘోరాగా కనిపించబోతున్నారు. తద్వారా ఈ తరహా పాత్రను పోషిస్తోన్న ఏకైక స్టార్ హీరోగా నిలిచారు. కాగా ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేసుకుని..సినిమాకి సంబధించి ఇంపారెటెంట్ షూట్ తో సహా ఓ పాట చిత్రీకరణ పూర్తి చేసుకుని..సినిమా షూటింగ్ కు ప్యాక్ అప్ చెప్పేసింది.

ఇన్నాళ్లు కరోనా ప్ర‌భావంతో వాయిదా ప‌డుతూ వ‌చ్చిన అఖండ్ షూటింగ్ పూర్తి కావ‌డంతో చిత్ర‌యూనిట్ ఆనందంలో సంబరాలు జరుపుకున్నారు. బాల‌కృష్ణ అండ్ టీం వేడుక చేసుకుంది. డైరెక్ట‌ర్ బోయ‌పాటి, బాల‌కృష్ణ‌, నిర్మాత‌లు, హీరోయిన్లు, ఇత‌ర చిత్ర‌యూనిట్ స‌భ్యులంతా క‌లిసి పార్టీ చేసుకున్నారు. ఆ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో బాల‌కృష్ణ చిరున‌వ్వుతో విక్ట‌రీ సింబ‌ల్ చూపిస్తుండ‌గా..ప‌క్క‌నే ఉన్న ప్ర‌గ్యాజైశ్వాల్ హీరోతో క‌లిసి హ్యాపీ పార్టీ మూడ్‌లో ఉన్న ఫొటో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news