Moviesవెండితెరపై సితార ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్..ఆ బడా హీరో సినిమాతోనే..?

వెండితెరపై సితార ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్..ఆ బడా హీరో సినిమాతోనే..?

సోష‌ల్ మీడియాలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు కుమారుడు గౌత‌మ్‌, కుమార్తె సితార ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గౌత‌మ్ కంటే కూడా సితార ఎప్ప‌టిక‌ప్పుడు యాక్టివ్‌గా ఉండ‌డంతో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. సోష‌ల్ మీడియాలో సితార పోస్టులు, వీడియోల‌కు దుమ్ము రేపే రెస్పాన్స్ ఎప్ప‌టిక‌ప్పుడు ఉంటుంది. ఓ సారి మ‌హేష్‌ను సైతం సితార‌, ద‌ర్శ‌కుడు వంశీ పైడ‌ప‌ల్లి కుమార్తె క‌లిసి ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ ఇంట‌ర్వ్యూ పెద్ద సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే.

ఇక సితార‌, గౌత‌మ్ ఫొటోల‌ను న‌మ్ర‌త కూడా ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మ‌హేష్ -న‌మ్ర‌త‌ల త‌న‌యుడు గౌతమ్ ఇప్ప‌టికే 1 నేనొక్క‌డినే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. సితార ఎంట్రీకి సంబంధించి కొన్నాళ్లుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ కూతురు అర్హ పాన్ ఇండియా మూవీ “శాకుంతలం”తో వెండితెరపై మెరవడానికి సిద్ధమైంది. ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార కూడా తెరంగేట్రం చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది.

మహేష్ బాబు, వంశీ పైడిపల్లి ఎమత బెస్ట్ ఫ్రేండ్సో మనకు తెలిసిందే. ప్రస్తుతం వంశీ పైడిపల్లి తమిళ్ స్టార్ హీరో విజయ్ తో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుందట. తండ్రి కూతురు సెంటిమెంట్ తో ఈ సినిమా ఉండటున్న కారణంగా..అందుకే కూతరు క్యారెక్టర్ కి సితారని తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పాత్ర కూడా చాలా లవ్లీగా క్యూట్ గా ఉంటుందని ఒక టాక్ అయితే వస్తోంది. స్టోరీ లైన్ విన్న మహెష్ ఇంప్రేస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అతి త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news