Moviesరామ్‌ చరణ్‌ కు ఈరోజు చాలా స్పెషల్‌ డే..ఏంటో తెలుసా..?

రామ్‌ చరణ్‌ కు ఈరోజు చాలా స్పెషల్‌ డే..ఏంటో తెలుసా..?

మెగా పవర్‌స్టార్ రాంచరణ్.. టాలీవుడ్ మెగా స్టార్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. తన దైన స్టైల్లో నటిస్తూ.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరో. తండ్రి మెగా స్టార్‌, బాబాయ్‌ పవర్‌ స్టార్‌.. వీరిద్దరి లక్షణాలను పుణికి పుచ్చుకున్న హీరో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌…ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమాలో నటిస్తున్న ఆయన త్వరలో సెన్సేషనల్ దర్శకుడు శంకర్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నారు.

ఇక్ చరణ్ తొలి సినిమాతోనే తనలోని నట విశ్వరూపాన్ని చూపించారు చెర్రీ. మెగా పవర్ స్టార్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో చిరుత అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఫలితం సంగతి పక్కన పెడితే రామ్ చరణ్ హీరోగా ఎలివేట్ చేయడానికి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది. డ్యాన్సులు ఫైట్లు అన్ని సమపాళ్లలో కుదిరిన సినిమా రామ్ చరణ్ కు గొప్ప ఎంట్రీ సినిమా గా మిగిలి పోయిందని చెప్పవచ్చు. మెగా స్టార్ తనయుడిగా సినిమాల్లోకి వచ్చిన చరణ్ తొలి సినిమా తోనే మంచి పేరు తెచ్చుకున్నాడు.పేరుకు నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అనతి కాలంలోనే టాలీవుడ్‌ అగ్ర హీరోల సరసన నిలిచారు రామ్‌ చరణ్‌.

అయితే రామ్‌చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తాజాగా 14 సంవత్సరాలు పూర్తి అయింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుత సినిమాలో సెప్టెంబ్‌ 28, 2007లో విడుదలైన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు ఎప్పటికి మర్చిపోలేని కానుక ఇచ్చారు. ఇందులో భాగంగానే అభిమానులు తమ అభిమాన హీరోకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను ఇచ్చారు. రాష్ట్ర రామ్‌ చరణ్‌ యువశక్తి పేరుతో ఉన్న ట్వి్ట్టర్‌ ఖాతాలో అద్భుతమైన వీడియోను పోస్ట్‌ చేశారు. రామ్ చరణ్ తన కెరీర్‌లో మరిన్ని విజయాలు సాధించాలని వాళ్లు కోరుకున్నారు. దీంతో చెర్రీ సినీ జీవితం 14 ఏళ్లు గడుస్తోన్న నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news