Moviesనాకు నచ్చదు..కేవలం పదిహేను నిమిషాలు ఆనందం కోసం ఇలా చేయలేను..!!

నాకు నచ్చదు..కేవలం పదిహేను నిమిషాలు ఆనందం కోసం ఇలా చేయలేను..!!

రేణుదేశాయ్..ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒక్కప్పుడు ‘బద్రి’, ‘జానీ’ మూవీస్‌లో నటించి ఆ తర్వాత తెరకు దూరమైంది ..ఆ తరువాత పవన్ పెళ్లి చేసుకుని..ఇద్దరు బిడ్డలకు తల్లై.. వాళ్ళ మధ్య మన్స్పర్ధలు రావడంతో.. విడాకులు తీసుకున్నారు. ఇక రేణూ పవన్‌కి దూరమైన తరువాత టెలివిజన్ ప్రోగ్రాంలో జడ్జ్ పాత్రలో కనిపిస్తూ అలరిస్తుంది. అయితే ఆమెకు సినిమాల్లో నటించాలనే ఆశ అయితే లేదు కానీ వాణిజ్య ప్రకటనల్లోనూ…బుల్లి తెర మీద మెరవాలని మాత్రం రేణు ఆశపడుతోందట.

ఒకప్పుడు కళామందిర్ కళ్యాణ్ ”కాంచీపురం వరమహలక్ష్మి సిల్క్స్”కి రేణుదేశాయ్‌ని బ్రాండ్‌గా ఎంపిక చేసుకొని ఓ యాడ్ ఫిల్మ్‌‍ని చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఒక పక్క రేణు మాజీ భర్త పవన్ రాజకీయాల్లో ..సినిమాలో బిజీ అవుతుంటే ఈమె ఈ విధంగా బిజీ అవుతోందనమాట. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రెణూ..తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఇక తాజాగ రేణూ చేసిన పోస్ట్..అందరి మనసులని కదిలిస్తుంది.

ఇక రేణూ దేశాయ్ తాజాగా జంతు పరిరక్షణకు సంబంధించిన ఓ సంస్థ చేసిన పోస్ట్‌ను రేణూ దేశాయ్ తిరిగి షేర్ చేశారు. “ఓ జంతువు లైఫ్ టైం మొత్తాన్ని.. దాని భయం, దాని బాధ, నొప్పి ఇవన్నీ కేవలం నా పదిహేను నిమిషాల సుకానికి సమానం కాదు అని తెలుసుకున్నాను కాబ్బటే..అది నచ్చకే వేగన్‌గా మారిపోయాను అంటూ పోస్ట్ లో రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news