Moviesబోయపాటి ప్లాన్ అదుర్స్.. ఇది కదా బాలయ్య ఫ్యాన్స్ కి కావాల్సింది..అఖండ...

బోయపాటి ప్లాన్ అదుర్స్.. ఇది కదా బాలయ్య ఫ్యాన్స్ కి కావాల్సింది..అఖండ నుంచి అదిరిపోయే అప్డేట్..?

యువ‌ర‌త్న‌, నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. బోయ‌పాటి – బాల‌య్య కాంబో అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు అఖండ సైతం వీరి కాంబోలో ఖ‌చ్చితంగా హ్యాట్రిక్ కొడుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అందుకే అఖండ‌కు అదిరిపోయే బిజినెస్ జ‌రుగుతోంది. సాలిడ్ యాక్ష‌న్ సీక్వెన్స్‌తో వ‌స్తోన్న ఈ సినిమాను మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు.

బాలకృష్ణ బోయ‌పాటి .. కాంబోలో సినిమా వస్తే అది బ్లాక్ బస్టర్ నే. దర్శకుడు బోయపాటి శ్రీను, స్టార్ హీరో బాలయ్య కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం”అఖండ”లో బాలయ్య ఫ్యాన్స్ కు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో హీరో బాలకృష్ణ మొట్ట మొదటిసారిగా అఘోర పాత్రలో నటిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన పోస్టర్, టీజర్ లు ప్రేక్షకులను ఆకట్టుకుని అంచనాలను మరింత పెంచాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది.

ఇక సింహ, లెజెండ్ సినిమాల్లో బోయపాటి బాలకృషణను ఎంత పవర్‌ఫుల్‌గా డైనమిక్ గా చూపించారో మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో అంతకుమించి పవర్ఫుల్ ఫైట్ సీన్స్ ప్రెజెంట్ చేయనున్నారట బోయపాటి. ఈ చిత్రంలో ఓవర్ ఆల్ గా మొత్తం ఎనిమిది ఫైట్ సీన్స్ ఉంటాయట..ఇందులో ముఖ్యంగా..ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్ టోటల్ క్ధని మలుపు తిప్పుతుందనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఫైట్ సీన్స్ అన్నీ కూడా ఓక్కోకటి ప్రత్యేకంగా ఉంటాయని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. నందమూరి అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వడమే టార్గెట్‌గా పెట్టుకొని బాలయ్యను రంగంలోకి దించుతున్నారట బోయపాటి.ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ హైలైట్ కానున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news