Moviesబడా హీరోలకే మైండ్ బ్లాక్ చేస్తున్న ధనుష్ ఆస్తుల చిట్టా..ఇన్ని కోట్లా..??

బడా హీరోలకే మైండ్ బ్లాక్ చేస్తున్న ధనుష్ ఆస్తుల చిట్టా..ఇన్ని కోట్లా..??

ఈ రంగుల ప్రపంచం లో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలియదు. హీరోగా ఉన్నవాడు జీరో అవుతారు..నాకు సినిమాలు చేయడం ఇష్టం లేదురా బాబోయ్ అన్న వ్యక్తులనే అవకాశాలు వెత్తుకుంటూ వస్తాయి. అవునండి నిజం..బయట ఎందరో హీరో, హీరోయిన్ లు కావాలని చాలా కష్ట పడుతుంటారు. కానీ వాళ్ళకు అవకాశాలు రావు. సినిమాలు అంటే ఇష్టం లేని వాళ్లకు మాత్రం పిలిచి అవకాశాలు ఇస్తుంది ఈ రంగుల ప్రపంచం. దానికి బెస్ట్ ఉదాహరణ్..కోలీవుడ్ హీరో ధనుష్.

హీరోగా ఎదగాలి అంటే కావాల్సింది కలర్.. పర్సనాలిటీ కాదు. హీరో కావాలంటే కష్టపడ్డాలి.. క్రమశిక్షణ ఉండాలి అని నిరూపించాడు హీరో ధనుష్. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన ధనుష్ చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఎన్నో కష్టాలు పడి స్టార్ హీరోగా ఎదిగి ఓ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. వాస్తవానికి ధనుష్‌కి నటనపై ఇష్టమే లేదట. తన తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా కోరిక మేరకు బలవంతంగా సినిమాల్లో నటించాడు. అలా అయిష్టంగానే సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు కోలివుడ్‌లో స్టార్‌ హీరోగా ఎదిగాడు. కొలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు అయినప్పటికీ.. సొంతంగానే తన నటన టాలెంట్ ఉపయోగించి ప్రతి సినిమాకు మంచి క్రేజ్ ను పెంచుకుంటూపోతున్నాడు.

ఉత్తమ నటుడిగా 2 సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్న ధనుష్ చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. తమిళంతో పాటు.. బాలీవుడ్‌లోనూ ఆయన పలు సినిమాల్లో నటించారు. కాగా ఇప్పతివరకు డైరెక్ట్ తెలుగు సినిమా చేయని ధనుష్.. శేఖర్ కమ్ములతో ఓ సినిమా కు సైన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ధనుష్ నటించబోతున్న తెలుగు తొలి సినిమాకు గాను 50 కోట్లు పారితోషికంగా అందుకోబోతున్నాడు. ఈ క్రమంలో ఆయన ఆస్తుల చిట్టా బయటపడ్డింది. ఆయన దగ్గర ఐదు ఖరీదైన కార్లు ఉన్నట్లు తెలుస్తుంది.

ఒక్కో కారు విలువల దాదాపుగా రూ.4 కోట్లకు పైనే ఉంటుందట. అలానే మొత్తంగా హీరో ధనుష్‌కు రూ.200 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మున్నటి వరకు ఒక్కో సినిమాకి 10 నుండి 15 కోట్లు పారితోషకంగా తీసుకునే ధనుష్ .. డైరెక్ట్ గా చేస్తున్న తెలుగు మూవీ కి ఏకంగా 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడంతో బడా హీరోల కు సైతం షాకింగా అనిపిచిందట. మరి చూడాలి ధనుష్ తెలుగులో తన మార్కెట్ లెవల్ ఎలా పెంచుకుంటాడో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news