Moviesఅభిమానులారా..సిద్ధం కండి..పుష్ప నుండి మరో క్రేజీ అప్డేట్..?

అభిమానులారా..సిద్ధం కండి..పుష్ప నుండి మరో క్రేజీ అప్డేట్..?

సుకుమార్ రంగ‌స్థ‌లం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని మరీ వర్క్ చేస్తున్న సినిమా పుష్ప. ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆర్య‌, ఆర్య 2 త‌ర్వాత అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేష‌న్‌లో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో ముదటి సారి అల్లు అర్జున్ కు జంటగా..రష్మిక మందన నటిస్తుంది. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..ఈ సినిమాలో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ర‌ష్మీక గిరిజ‌న అమ్మాయిగా కనిపించబోతుంది. ఇక బ‌న్నీ కూడా అదే తరహాలో ఆమెను ప్రేమించే గిరిజ‌న యువ‌కుడి గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. అందుకే ఈ సినిమా కోసం చిత్తూరు యాస‌ను చాలా క‌ష్ట‌ప‌డి మ‌రీ నేర్చుకున్నాడ‌ని తెలుస్తోంది. మాస్ లుక్‌లో వెండితెరపై బన్నీని చూడాలని కుతూహల పడుతున్నారు.

రష్మిక మంద‌న్న‌ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్,సాంగ్ ఇంకా పోస్టర్ లతో పాన్ ఇండియా రేంజ్ లో పెద్ద హైప్ క్రియేట్ చేసి దూసుకు పోతుంది. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేక పాట నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. రికార్డు స్థాయిలో యూట్యూబ్‌లో వ్యూవ్స్, లైక్స్ సాధించింది ఈ సినిమా ఫస్ట్ సింగల్. ఇక పుష్ప గురించి వ‌స్తోన్న వార్త‌లు ఎగ్జైట్మెంట్ పెంచేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి గురించి ఫ్యీజులు ఎగిరిపోయే అప్ డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.

ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్‌కి ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇప్పటివరకూ విడుదలైన టీజర్లు, ఫస్ట్‌లుక్‌లలో హీరోయిన్ రష్మికకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో రెండో పాట పూర్తి రొమాంటిక్‌గా.. ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా సంగీత దర్శకుడు దేవీ శ్రీ కంపోజ్ చేశారు అని తెలుస్తోంది. సెకండ్ సింగిల్ కూడా భిన్నంగా ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తుండ‌గా, కథానాయికకు సంబందించిన సాంగ్ వినాయకచవితి సందర్బంగా విడుదల చేయనున్నట్లు సమాచారం.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news