Moviesప్రభాస్ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..?

ప్రభాస్ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.బాహుబలి’ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో ఆయన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. చిన్న హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తరువాత మీడియం రేంజ్ హీరోగానూ .. అటు తరువాత స్టార్ హీరోగానూ.. ఇప్పుడు అయితే ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగాడు.

 

ప్రస్తుతం ఈయన చేతిలో ఉన్నవని బడా ప్రజెక్ట్ లే. రాధేశ్యాం, సాలార్, ఆది పురుష్ మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు ఈ ఆరు అడుగుల అందగాడు. ఇప్పటికే రాధేశ్యాం సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం సాలర్ సినిమా, ఆది పురుష్ తో పాటు నాగ్ అశ్విన్ సినిమా లైన్లో ఉన్నాయి. ఇక దీంతో పాటు ఆయన తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాని నిర్మాత దిల్ రాజుతో కలిసి చేస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓ సెన్సేషనల్ డైరెక్టర్ తో ఈ సినిమాని డైరెక్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఇక క్ద విషయానికి వస్తే పీరియాడిక్ మైథాలజీ డ్రామాగా ఈ సినిమా స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు ‘వృందావన్’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఛాంబర్‌లో దిల్ రాజు ఈ టైటిల్‌ని కూడా రిజిస్టర్ చేయించేసారట. మొత్తానికి ప్రభాస్, దిల్‌ రాజు కాంబోలో వచ్చే సినిమాకు ‘వృందావన్’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news