Gossipsవిజయ్ గొంతెమ్మ కోర్కెలు.. ఏం చేయ్యలేక చేతులెత్తేసిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు..?

విజయ్ గొంతెమ్మ కోర్కెలు.. ఏం చేయ్యలేక చేతులెత్తేసిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు..?

టాలీవుడ్ లో ఇప్పుడు యూత్ హీరోగా విజయ్ దేవరకొండ ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయన నటించిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సినిమాలతో యూత్ హీరోగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ‘లైగర్’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

అయితే ఈ సినిమా తరువాత విజయ్ దేవ‌ర‌కొండ డైరెక్ట‌ర్ సుకుమార్ తో ఓ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చడు. సుకుమార్ ని లైన్ లో పెట్టే.. మ‌రోవైపు మజిలీ ఫేం శివ నిర్వాణ తో సినిమా చేయ‌బోతున్నాడ‌ని ఓ వార్త బయటకు వచ్చింది. గతంలోనే వీరు కలిసి ఫిల్మ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత మాత్రం ఈ ప్రాజెక్టు గురించి ఎటువంటి సమాచారం రాలేదు. దాంతో, ఈ సినిమా ఉండదనే అభిమానులు అనుకున్నారు. అయితే, విజయ్, శివ నిర్వాణ కాంబినేషన్ లో సినిమా రూపొందనుందని తాజాగా ఇండస్ట్రీలో మళ్ళీ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలు నిజమయ్యి విజయ దేవరకొండతో శివ నిర్వాణ సినిమా ఒకవేళ తీస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అభిమానులలో నెలకొంది. ఎందుకంటే శివ నిర్వాణ ఇప్పటివరకు ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సున్నితమైన సినిమాలను తెరకెక్కించాడు. ఈ కారణంగా విజయ్ దేవరకొండని శివనిర్వాణ తనదైన శైలిలో తన సినిమాలో ఎలా చూపిస్తాడా అన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇక్కడ షాకింగ్ మ్యాటర్ ఏమిటంటే.. విజ‌య్ డైరెక్ట‌ర్ శివ‌నిర్వాణ‌ను స్క్రిప్ట్ లో మార్పులు చేయాల‌ని సూచిస్తున్నారట. అంతేకాదు..మ‌రోవైపు నిర్మాత‌ల‌కు బ‌డ్జెట్ పెంచాల‌ని చెప్పాడ‌ని న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. అంతేకాదు అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ కోరిన‌ట్టుగానే శివ‌నిర్వాణ క‌థ‌లో మార్పులు చేసేందుకు సిద్దంగా ఉన్నా.. విజ‌య్ మాత్రం పాన్ ఇండియా స్థాయికి చేరుకునేలా భారీ మార్పులు ఆశిస్తుండ‌టంతో శివ నిర్వాణ చేతులెత్తేసిన్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news