Gossipsహింట్ ఇస్తున్న కృతిస‌న‌న్..కొంప ముంచేస్తుందా ఏంటీ..??

హింట్ ఇస్తున్న కృతిస‌న‌న్..కొంప ముంచేస్తుందా ఏంటీ..??

వయ్యారి భామ కృతిస‌న‌న్..మహేష్ బాబు వ‌న్..నేనొక్క‌డినే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై.. నాగ‌చైత‌న్య‌తో క‌లిసి దోచెయ్ సినిమాలో న‌టించింది. కానీ ఆ సినిమా తర్వాత టాలీవుడ్ లో అంతగా అవకాశాలను అందుకోలేకపోయింది కృతి. ఆ తర్వాత తెలుగు నుంచి బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ అమ్మడు.. అక్కడ మాత్రమే వరుస ఆఫర్లతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది…అక్ష‌య్ కుమార్‌, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాల‌తోపాటు ప‌లు సినిమాల్లో న‌టిస్తూ బిజీ అయిపోయింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో వస్తున్న ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది.

Adipurush: Special song on Prabhas and Kriti Sanon - tollywood

వరుస విజయాలతో వెళుతున్న ఈ ఢిల్లీ భామ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ రెమ్యునరేషన్ ను మూడు కోట్ల పై మాటే. ఇకపోతే కృతిసనన్ టైగర్ ష్రాఫ్ తో కలిసి గణపత్ అనే ఒక అవుట్-అవుట్-యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తాజాగా కృతికి మరో భారీ ఆఫర్ వచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కిల్ బిల్ హిందీ రీమేక్ లో నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు బీ టౌన్ లో కథనాలు వస్తున్నాయి.

Kriti Sanon Astonishing Looks In a Royal Outfit - Photogallery - Page 2

అయితే , తాజాగా కృతిసనన్ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పెళ్ళికూతురు డ్రెస్ లో చక్కగా ముస్తాబై , ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం తో కృతిసనన్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కృతిసనన్ నిజంగా పెళ్లిపీటలు ఎక్కబోతోందా..?? లేక ఏదైనా సినిమా లో భాగంగానే ఫోటోలు దిగిందా..?? అనే విషయం పై క్లారిటీ రావాలి. అయితే ఈ ఫోటోస్ చూసిన కొందరు నెటిజన్స్..పెళ్లి ఫిక్స్ అయ్యిందని మా కొంప ముంచకే కృతి అంటూ కామెంట్స్ పెడుతున్నారు..!

Kriti Sanon Astonishing Looks In a Royal Outfit - Photogallery - Page 1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news