Moviesసావిత్రి ఎత్తుకోని ఉన్న ఈ బాబు ఎవరో తెలిస్తే.. అసలు నమ్మలేరు...

సావిత్రి ఎత్తుకోని ఉన్న ఈ బాబు ఎవరో తెలిస్తే.. అసలు నమ్మలేరు తెలుసా..??

ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ ఉన్నారు. ఇక వారికీ సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే సాధారణంగా హీరోస్ ప్రస్తుతం ఎలా ఉన్నారో చూస్తున్నాం.. కానీ వారు చిన్నప్పుడు ఎలా ఉంటారో అని ప్రతి ఒకరికి తెలుసుకోవాలని ఉంటుంది. అలాగే ఓ హీరో ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో మహానటి సావిత్రి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా.. అంటూ వైరల్ అవుతుంది.

ఈ చిన్నారి హీరో ని గుర్తు పట్టడం కష్టం అంటారా? సరే మీకోసం ఈ ఫోటోకి సంబంధించి క్లూ ఇస్తే గుర్తు పట్టగలరేమో ఒక్కసారి చూద్దాం. ఈ ఫొటోలో ఉన్నది ఓ గ్రీకువీరుడు..ఓ మన్మధుడు.. తన అందంతో అందరిని ప్లాట్ చేసేశ్తాడు. ఇక ఈ క్లూతో అయినా ఈ చిన్నారి హీరో ని గుర్తించారా?.. యస్…మీరు అనుకున్నది నిజమే.. ఈ ఫోటోలో ఉన్నది అక్కినేని అందగాడు నాగార్జున.

మహానటి సావిత్రి ఎత్తుకుని ముద్దాడుతున్న ఆ చిన్నారి ఇప్పటి టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. అప్పట్లో టాలీవుడ్‌ను ఏలిన కథానాయకులు ఎన్‌టీ రామారావు, అక్కినేని నాగేశ్వరావుల కుమారులు చిన్నతనంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో నాగేశ్వరావు, సావిత్రిలు జంటగా నటించిన వెలుగు-నీడలు చిత్రంలో నాగ్‌ చైల్డ్‌ అర్టిస్టుగా కనిపించాడు. ఈ మూవీ సమయంలో నాగార్జున 8 నెలల పసిబాబుగా ఉన్నాడు. ప్రస్తుతం నాగారజున బంగారాజు సినిమా షూటింగ్ పనులతో బిజీ బిజీ గా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news