Gossipsబాలయ్య దెబ్బకి..టెన్షన్ పడుతున్న "రాజమౌళి"..?

బాలయ్య దెబ్బకి..టెన్షన్ పడుతున్న “రాజమౌళి”..?

యుర‌వ‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ మంచి జోరు మీద ఉన్నారు. ఒకదాని తరువాత ఒకటి సినిమాలు ఫైనల్ చేసుకుంటూ.. వ‌రుస పెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.. ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తోన్న బాల‌య్య ఆ వెంట‌నే మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌కత్వంలో మ‌రో సినిమా .. ఈ రెండు సినిమాల త‌ర్వాత అనిల్ రావిపూడి సినిమాకు బాల‌య్య ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఆ త‌ర్వాత క్రిష్ మ‌రోసారి బాల‌య్య‌తో క్రేజీ ప్రాజెక్టును తెర‌కెక్కించాల‌ని చూస్తున్నారు.

ఇక దర్శకుడు బోయపాటి శ్రీను, స్టార్ హీరో బాలయ్య ఈ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కాంబోలో సినిమా వస్తే అది బ్లాక్ బస్టర్ నే. దర్శకుడు బోయపాటి శ్రీను, స్టార్ హీరో బాలయ్య కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం”అఖండ”. బాలయ్య ఫ్యాన్స్ కు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో హీరో బాలకృష్ణ మొట్ట మొదటిసారిగా అఘోర పాత్రలో నటిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన పోస్టర్, టీజర్ లు ప్రేక్షకులను ఆకట్టుకుని అంచనాలను మరింత పెంచాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ  అప్డేట్ బయటకు వచ్చింది.

నిజానికి మే 28 న విడుదల కావాల్సిన ఈ సినిమా.. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా అనుకున్న దానికంటే షూటింగ్ మరింత నెమ్మదిగా జరుగుతుంది. అందుకే సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయడం దాదాపు అసాధ్యం. దాంతో అక్టోబర్ లో అఖండ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని టాక్.

ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 8న ఈ సినిమాను విడుదలకు తేది దాదాపు ఖరారు అయిపోయినట్లు తెలుస్తోంది.. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..అక్టోబర్ 13న రాజమౌళి RRR సినిమా విడుదల కాబోతుండటమే. అఖండ సినిమా అక్టోబర్ 8న రిలీజ్ అయితే..ఇప్పటికే ఎన్నో సార్లు సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తు వస్తున్న రాజమౌళి..మరోసారి వాయిదా వేయల తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి చూడాలి ఏం జరుగుతుందో..

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news