Newsరాజశేఖర్ తో కూతురిగా నటించి , తిరిగి హీరోయిన్ గా నటించిన...

రాజశేఖర్ తో కూతురిగా నటించి , తిరిగి హీరోయిన్ గా నటించిన నటి ఎవరో తెలుసా ..?

సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన విషయం తెలిసింది. అందులో ముఖ్యంగా శ్రీదేవి కూడా అడుగు పెట్టి , ఆ తరువాత అదే హీరో సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆయన ఎవరో కాదు ఏఎన్ఆర్. ఏఎన్ఆర్ సినిమాలో మొదట చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టిన శ్రీదేవి , ఆ తర్వాత ఆయన సరసన స్టెప్పులేసింది. ఇలాంటి కోవకు చెందినది ఒక స్టార్ హీరోయిన్ కూడా. రాజశేఖర్ తో కూతురు గా నటించింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని తిరిగి రాజశేఖర్ పక్కన హీరోయిన్ గా నటించింది. ఇంతకీ ఆమె ఎవరు..? ఆ సినిమా ఏంటో..? ఒకసారి తెలుసుకుందాం..

Raasi (Actress) Wiki, Biography, Age, Movies, Images - News Bugz

1989 సంవత్సరం ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మమతల కోవెల. ఇందులో హీరోయిన్ గా సుహాసిని నటించగా, హీరోగా రాజశేఖర్ నటించి మెప్పించారు. ఈ సినిమాలో ఇద్దరు పిల్లలు ఉండటం మనం గమనించే ఉంటాం. ఆ చిన్న పాప ఎవరో కాదు రాశి. ఇందులో రాశి , రాజశేఖర్ కూతురు పాత్రలో నటించి మెప్పించింది. అంతేకాదు ముద్దు ముద్దు మాటలతో అందర్నీ అలరించిన రాశి తిరిగి 10 సంవత్సరాల తర్వాత 1999 వ సంవత్సరంలో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన నేటి గాంధీ అనే సినిమాలో రాజశేఖర్ పక్కన హీరోయిన్ గా నటించి , అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చిత్రాన్ని ఆర్.బి.చౌదరి నిర్మించిన విషయం తెలిసిందే.

Neti Gandhi (1999) Mp3 Songs Free Download - RKOnMp3

మొదట ఒక హీరోకి కూతురు గా నటించి, తిరిగి ఆ కూతురు పెద్దయ్యి ,అదే హీరో కి హీరోయిన్ గా నటించింది అంటే అది ఎంత పెద్ద విశేషమో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అయితే రాశి ఆ తర్వాత శ్రీకాంత్, వెంకటేష్ ,బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కూడా నటించి ఒక మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news