Moviesస్టార్ డైరెక్ట‌ర్ చేతిలో కోట‌కు ఇంత అవ‌మానం జ‌రిగిందా ?

స్టార్ డైరెక్ట‌ర్ చేతిలో కోట‌కు ఇంత అవ‌మానం జ‌రిగిందా ?

కోట శ్రీనివాసరావు .. అప్పట్లో ఈయన ఎన్నో పాత్రలలో నటించి, ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు అంటే ఒక విలన్ గా మంచి గుర్తింపు కూడా ఉంది. ఇక ఈ పాత్రలో ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు అనేంతగా.. విలన్ గా ఆయన కొంతకాలం కొనసాగి, ఆ తర్వాత బాబు మోహన్ తో కలిపి పండించిన కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు ఇప్పటికీ కనువిందు చేస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు విలన్ గా దర్శనమిస్తూ , అప్పుడప్పుడు కమెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటారు. అయితే తన కొడుకు మరణాంతరం ఆయన కూడా పూర్తిగా మానసికంగా క్షోభ కు గురికావడంతో కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది.

Kota Srinivasa Rao now in Tiger Shroff's Baaghi

అయితే ఇటీవల సినీ ఇండస్ట్రీలో పెద్దల సహకారంతో మళ్ళీ చిన్న చిన్న పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక విస్తుపోయే నిజాన్ని బయట పెట్టాడు. అది కూడా కృష్ణవంశీ బాగా అవమాన పరిచాడు అంటూ ఆవేదనను వ్యక్తం చేశాడు. కోలీవుడ్లో కృష్ణ వంశీ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయనకు అనుగుణంగా నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు లేకపోయారు.

kota srinivasa rao: Kota Srinivasa Rao slams media reports on his health |  Telugu Movie News - Times of India

అప్పుడే ప్రకాష్ రాజ్ ని తీసుకువచ్చి తన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా , విలన్ గా పరిచయం చేశాడు. అందుకే ప్రకాష్ రాజ్ నటనకు రెండు నంది అవార్డులు కూడా వచ్చాయి అని కోట శ్రీనివాసరావు తెలిపాడు. అయితే ఆ సందర్భంలోనే కోట శ్రీనివాస్ రావు పై పెద్ద ఎత్తున కొన్ని వార్తలను ప్రచారం చేశాడు కృష్ణవంశీ. ఈ విషయంపై కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నేను షూటింగ్ ముగించుకుని ఇంటికి వచ్చే సరికి రాత్రి మూడు గంటల సమయం పడుతుంది. చిన్నగా ఒక పెగ్ మాత్రమే తాగి తిరిగి మళ్ళీ 5 గంటలకు తెల్లవారుజామున లేచి షూటింగ్ కి వెళ్లి పోవాల్సి ఉంటుంది.

Krishna Vamsi to revive his big budget project?

పగలంతా కష్టపడడం తో కొద్దిగా అలసట తీర్చుకోవడానికి కోసమే కొద్దిగా మందు తాగే వాడిని. అయితే కేవలం రెండు గంటల తర్వాత షూటింగ్ కి వెళ్లడంతో కచ్చితంగా నోటి నుంచి మందు వాసన వస్తుంది. కాబట్టి నేను బాగా మందు తాగుతాను అని కూడా కృష్ణవంశీ ప్రచారం చేశాడు. అయితే అప్పట్లో చిన్న వయసు కాబట్టి.. యుక్త వయసులో ఆయన చేసింది ఏమీ తప్పులేదు.. ఆ తర్వాత ఆయనే నన్ను తన సినిమాల్లో పెట్టుకున్నాడు అని తెలిపాడు కోట శ్రీనివాసరావు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news