Newsబన్నీలో ఆ లోపం..మీరు గమనించారా..??

బన్నీలో ఆ లోపం..మీరు గమనించారా..??

బన్నీ..అల్లు వారి అబ్బాయి. మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడు. ఆ బ్రాండ్ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఎంత ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. మనలో టాలెంట్ లేకపోతే.. ఇక్కడ ఈ రంగలో నిలబడలేరు. మేన మామ పేరు చెప్పుకుని.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తన సొంత టాలెంట్ తో.. తన నటనతో.. డ్యాన్స్ తో.. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాని సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఈయన నీ అభిమానులు ముద్దుగా బన్నీ అంటు పిలుచుకుంటారు.

ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ.. మోస్ట్ బిజీఎస్ట్ స్టార్‌గా అందరిచేత పిలిపించుకుంటున్నారు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ. పాన్‌ ఇండియా సినిమాల దగ్గర నుంచి పక్క ఇండస్ట్రీల డైరెక్టర్ల వరకు అన్నింటికి, అందరికీ ఫస్ట్ చాయిస్గా మారి అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నారు. ప్రస్తుతం పాన్‌ ఇండియ మూవీ “పుష్ఫ” సినిమాలో నటిస్తున్న బన్నీ.. ఆ తరవాత వరుసగా డైరెక్టర్లను లైన్లో పెట్టి మరో 2 సంవత్సరాలు డేట్లు ఖాళీలేనంతగా బిజీగా మారిపోయారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ పుష్ప. పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఫస్ట్ టైం బన్నీ పక్కన ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా కనిపించనున్నారు. శేషాచ‌లం అడ‌వుల్లోని గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్ ,పుష్ప సినిమా ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేక .. పాట యూట్యూబ్ ని షేక్ చేసింది. అలా దాక్కో దాక్కో మేక అనే పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. అయితే, ఈ సినిమా గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. ‘పుష్ప’లో అల్లు అర్జున్‌కి ఓ లోపం ఉందట. ఈ సినిమాలో స్మగ్లర్‌లా కనిపించే అల్లు అర్జున్‌ కి కుడి భుజం పని చేయదని.. అందుకే రీసెంట్‌గా విడుదల అయిన ‘దాక్కో దాక్కో మేక’ పాటలో కూడా ఆయన ఎడమ భుజంతో స్టెప్ వేశారట. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news