Gossipsఆ పాత్ర కోసం చిరంజీవి ఫోన్ చేసిన.. రిజెక్ట్ చేసిన బాలీవుడ్...

ఆ పాత్ర కోసం చిరంజీవి ఫోన్ చేసిన.. రిజెక్ట్ చేసిన బాలీవుడ్ బడా హీరో ఎవరో తెలుసా..??

ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి మలయాళ ‘లూసిఫర్’ తోపాటుగా తమిళ ‘వేదాళం’ చిత్రాన్ని కూడా రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే షురూ అయింది. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా ఒరిజిన‌ల్ వెర్ష‌న్ లో పృథ్విరాజ్ సుకుమార‌న్ చేసిన పాత్ర కోసం యాక్ట‌ర్ ను ఎంపిక చేసే ప‌నిలో పడ్డింది చిత్ర బృందం.

అయితే ఈ పాత్ర కు బాలీవుడ్ కండల వీరుడు ..స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ను అనుకున్నారట. అంతేకాదు ఆయనను అప్రోచ్ కూడ అయ్యారట. కానీ సల్మాన్ ఆ పాత్ర చేయడానికి ఇష్టపడలేదట. ఎందుకంటే.. ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమార్ పాత్ర నిడివి 5 నిమిషాలే ..అందుకే సల్మాన్ అంతగా ఇంట్రస్ట్ చూపించట్లేదట. దీంతో స్వయంగా చిరంజీవి స‌ల్మాన్ ఖాన్ నుసంప్ర‌దించ‌గా..స‌ల్లూ భాయ్ ఆ ఆఫ‌ర్ కు “నో” చెప్పాడ‌న్న వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి స‌ల్మాన్‌ఖాన్‌, చిరంజీవి జాన్ జిగిడి దోస్త్ లు..కానీ ఎంత క్లోజ్ అయినా ఇష్టంలేని పాత్ర చేయలేరుగా..అలాగే ఈ ఆఫర్ ను స‌ల్మాన్ రిజెక్ట్ చేసాడట. ఇక ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమార్ పాత్ర నిడివి 5 నిమిషాలే అయినా సినిమా చివరి వ‌ర‌కు ఆ పాత్ర ట్రావెలింగ్ అవుతుంది. ప్ర‌స్తుతం ఇదే పాత్ర కోసం స‌ల్మాన్ అంత‌గా ఆస‌క్తి చూపించ‌లేద‌ని టాక్ వినిపిస్తోంది. మరి సల్మాన్ రిజెక్ట్ చేసిన ఈ పాత్ర లో ఎవరు నటిస్తారో వేచి చూడాల్సిందే..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news