Gossipsబన్నీ బాగా ట్రై చేసారు..కానీ వర్క్ అవుట్ అవ్వలేదు..??

బన్నీ బాగా ట్రై చేసారు..కానీ వర్క్ అవుట్ అవ్వలేదు..??

అల్లు ఇంటి వారసుడు అర్జున్. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో. గంగోత్రి సినిమాతో చిన్న హీరోగా ఎంట్రీ ఇచ్చి..ఇప్పుడు టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక శ్టైల్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు బన్నీ. ఇక అలా తన ప్రతి సినిమాలో ఏదో ఒక్క డిఫరేంట్ స్టైల్ చూయిస్తూ.. స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ గా మారిపోయాడు బన్నీ. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే పుష్ప సినిమాలో న‌టిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్‌లు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే, ఈ సినిమా తరువాత బన్నీ వకీల్ సాబ్ సినిమాతో టాలీవుడ్ ని షేక్ చేసిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో.. ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి వేణు శ్రీరామ్ ఐకాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. దీనికి కనుబడుట లేదు అనే ట్యాగ్ లైన్ ఉంటుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. మరికొన్ని రోజుల్లో అల్లు అర్జున్ ఐకాన్ సెట్స్ మీదకు వెళ్ళబోతున్నారట.

అయితే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను కన్ఫర్మ్ చేశారనే టాక్ వినిపిస్తోంది. గతంలో “DJ: దువ్వాడ జగన్నాథమ్‌, అల.. వైకుంఠపురములో” సినిమాల్లో జోడీ కట్టి ఆడియన్స్ మెప్పుపొందిన ఈ హిట్ పెయిర్‌ని ముచ్చటగా మూడోసారి వెండితెరపై చూపించాలని ఫిక్సయ్యారాట. నిజానికి ఈ సినిమా కోసం చాలా మంది హీరోయిన లను ట్రై చేసారట . ఫైనల్ గా పూజానే ముందు వరుసలో ఉన్నారట. మరి.. అల్లు అర్జున్, పూజా అల… మూడోసారి జంటగా కనిపిస్తారా? వేచి చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news