Gossipsకొడుకుతో కలిసి ఖతర్నాక్ ప్లాన్ వేసిన అరవింద్..ఆ డైరెక్టర్ ఫుల్ హ్యాపీ..ఎందుకో...

కొడుకుతో కలిసి ఖతర్నాక్ ప్లాన్ వేసిన అరవింద్..ఆ డైరెక్టర్ ఫుల్ హ్యాపీ..ఎందుకో తెలుసా..??

అల్లు ఇంటి వారసుడు అర్జున్. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో. గంగోత్రి సినిమాతో చిన్న హీరోగా ఎంట్రీ ఇచ్చి..ఇప్పుడు టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా మనలో టాలెంట్ లేకపోతే ప్రేక్షకులు ఆదరించారు..ఎంకరేజ్ చేయరు. ఇక అలా తన ప్రతి సినిమాలో ఏదో ఒక్క డిఫరేంట్ స్టైల్ చూయిస్తూ.. స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ గా మారిపోయాడు బన్నీ.

నిజానికి అల్లు అర్జున్ చేసింది తక్కువ సినిమాలే అయినా..మంచి భారీ భారీ బ్లక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండ‌స్ట్రీ ప‌రంగా అతి త‌క్కువ టైంలోనే సూప‌ర్ హిట్ల‌తో ఓ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ సంక్రాంతికి వ‌చ్చిన అల వైకుంఠపురంలో ఘన విజయాన్ని సాధించి ఎన్నో రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే పుష్ప సినిమాలో న‌టిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్‌లు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం పుష్ప షూటింగ్ లో బిజీ బిజీ గా ఉన్నరు.

అయితే, ఈ సినిమా తరువాత బన్నీ వకీల్ సాబ్ సినిమాతో టాలీవుడ్ ని షేక్ చేసిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో.. ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి వేణు శ్రీరామ్ ఐకాన్ అనే టైటిల్ ఫిస్ చేసారు. దీనికి కనుబడుట లేదు అనే ట్యాగ్ లైన్ ఉంటుంది. ఇక ఈ సినిమా తరువాత ప్రాజెక్ట్ గీత గోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకొని హీరోల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు పరశురామ్ తో చేయన్నునాడట.

పరశురామ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. సర్కారు వారి పాట అనే టైటిల్‌‌‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తరువత అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యతో సినిమా చేయనున్నాడు. చైతూ సినిమా పూర్తయిన వెంటనే బన్నీతో సినిమా చేయనుండట పరశురామ్. అయితే ఈ సినిమా ని కూడా గీతా ఆర్ట్స్‌‌తో ప్లాన్ చేస్తున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news