Gossipsదుమ్ములేపుతున్న రాకీ భాయ్..సరికొత్త రికర్డ్ క్రీయేట్ చేసిన "KGF-2"..??

దుమ్ములేపుతున్న రాకీ భాయ్..సరికొత్త రికర్డ్ క్రీయేట్ చేసిన “KGF-2”..??

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ తెర‌కెక్కిన సినిమా కేజీఎఫ్‌. క‌ర్నాట‌క‌లోకి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ క‌థాంశం నేప‌థ్యంలో తెర‌కెక్కిన కేజీఎఫ్ 2018 డిసెంబ‌ర్లో రిలీజ్ అయ్యి దేశ వ్యాప్తంగా ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో హీరో య‌శ్‌తో పాటు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఓవ‌ర్ నైట్ స్టార్లు అయిపోయారు. ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మూడేళ్లు అవుతున్నా ఇంకా ఈ సినిమా రెండో పార్ట్ రిలీజ్ కాలేదు. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అంద‌రూ ఇప్పుడు కేజీఎఫ్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఈ సినిమాపై ఉన్న ప్రి రిలీజ్ బ‌జ్ అంతా ఇంతా కాదు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న కేజీఎఫ్ 2 త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లోకి రానుంది. ఇప్పుడు కేజీఎఫ్ 2 ఎప్పుడు వ‌స్తుందా ? అని సౌత్ సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. మ‌రోవైపు కేజీఎఫ్ ను క‌న్న‌డ సినీ ప్రేక్ష‌కులు క‌న్న‌డ బాహుబ‌లితో పోల్చుకున్నారు. ఇప్పుడు కేజీఎఫ్ 2 సైత కేజీఎఫ్‌ను మించిన హిట్ అవుతుంద‌ని ఆశ‌ల‌తో ఉన్నారు. మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా అంచ‌నాలు ఉన్న ఈ సినిమా గురించి ఓ అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది.

ఈ చిత్రం తాలూకా శాటిలైట్ హక్కులు సౌత్ ఇండియన్ భాషలకు సంబంధించి డీల్ జీ సంస్థల వారికి క్లోజ్ అయ్యాయని కన్ఫర్మ్ అయ్యిందట. ఈ ఫిగ‌ర్ టోట‌ల్ సౌత్ ఇండియా సినిమా హిస్ట‌రీలోనే హ‌య్య‌స్ట్ అట‌. అయితే భారీ ధరకే ఈ హక్కులు అమ్ముడు పోయాయని తెలిసింది కానీ అసలైన ఫిగర్ ఎంత అన్నది ఎక్కడా రివీల్ కాలేదు. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ ప్రకారం దీనికి కూడా అన్ని భాషల్లో రికార్డు బ్రేకింగ్ ధరనే పలికినట్టు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news