Gossipsయాంకర్ రవి ఆస్థి అన్ని కోట్లా..లీకైన షాకింగ్ మ్యాటర్..??

యాంకర్ రవి ఆస్థి అన్ని కోట్లా..లీకైన షాకింగ్ మ్యాటర్..??

బుల్లితెర పై మేల్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రవి పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఫీమేల్ యాంకర్స్ లో సుమ ఎంతటి పాపులార్టీ తెచ్చుకుందో మేల్ యాంకర్స్ లో రవి కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు. మేల్ యాంకర్స్‌లో ప్రదీప్ క్లాస్ ఫాలోయింగ్ సంపాదిస్తే.. మాస్ మహారాజా అనిపించుకున్నాడు రవి. పటాస్ లాంటి షోలను ఏళ్ల పాటు నడిపించిన ఘనత మనోడి సొంతం. అంతేకాదు మాస్ యాంకరింగ్‌తో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

యాంకర్ రవి హంగామా ఇప్పుడు మామూలుగా లేదు. బుల్లితెరపైన మనవాడు చేస్తున్న హల్చల్‌కి పైసలు కూడా లక్షల్లో వస్తున్నాయి. మా మ్యూజిక్‌లో యాంకరింగ్ స్టార్ట్ చేసిన ఈఅయన.. ఆ తర్వాత నుంచి వెనుదిరిగి చూసే అవసరం రాలేదు రవికి. మంచి నటుడు కూడా అవ్వడంతో డే టు డే యాంకర్‌గా అద్భుతంగా డెవలప్ అయ్యాడు. జీ తెలుగులో వచ్చిన మొండి మొగుడు పెంకి పెళ్ళాం దెబ్బకు రవికి బుల్లితెరపైన స్టార్ ఢం వచ్చేసింది.

ఈటీవీలో వచ్చిన ఢీ జూనియర్స్, జీ తెలుగులో ఫ్యామిలీ సర్కస్ లాంటి ప్రోగ్రామ్స్‌తో రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెరిగిపోయింది. పదివేలతో స్టార్ట్ అయిన రవి ఇప్పుడు నెలకు పదిలక్షలు తీసుకుంటున్నాడు. తెలుగు టాప్ ఛానల్స్ అన్నీ కూడా మనవాడిని యాంకర్‌గా తీసుకోవడానికి పోటీ పడుతున్నాయంటేనే మనవాడి రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

తన వాయిస్‌తో పాటు ఎనర్జీ లెవల్స్‌ని కూడా ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ ఇస్తున్న యాంకర్ రవి ప్రస్తుతం ఏకంగా ఐదు షోస్ కి యాంకర్ గా చేస్తూ బిజీ అయ్యాడు. ప్రస్తుతం రవి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి రెడీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన ఆస్తుల చిట్టా లీకైన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యాంకర్ రవి కి 5-7 కోట్ల ఆస్తి ఉన్నట్లు టాక్ . కోట్ల ఆస్థి సంపాదించినప్పటికీ ఇంకా సింపుల్ గానే ఉంటాడు యాంకర్ రవి. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో రవి మాట్లాడుతూ ఉన్నంతలో సర్దుకుపోవడమే తనకు ఇష్టమని అన్నాడు. తన కూతురికి మంచి విద్యను అందిస్తే చాలని అదే అసలైన ఆస్తి అని చెప్పుకొచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news