Moviesఈ ‘వల్లంకి పిట్ట’ పాప ఇప్పుడు ఎలా ఉందో చూడండి.. మీ...

ఈ ‘వల్లంకి పిట్ట’ పాప ఇప్పుడు ఎలా ఉందో చూడండి.. మీ కళ్లని నమ్మలేరు..!!

చైల్డ్ ఆర్టిస్ట్‌లు హీరోలు, హీరోయిన్‌‌లు‌గా మారడం అనేది ఇప్పటివరకు చాలానే చూశాం.. మహేష్, ఎన్టీఆర్, తరుణ్, కళ్యాణ్ రామ్, బాలాదిత్య, తేజ సజ్జ, ఆకాష్ పూరి, రాశి, తులసి, శ్రియ శర్మ, సుహాని ఇలా చాలామందే ఉన్నారు. తాజాగా కావ్య ఈ లిస్టులో చేరుతోంది. కావ్య అంటే గుర్తు పట్టడం కష్టం కానీ.. అల్లు అర్జున్ మొదటి సినిమా ‘గంగోత్రి’లో ‘వల్లంకి పిట్ట’ పాటలో చిన్నప్పటి కథానాయికగా కనిపించింది ఆ కావ్య అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు …

అల్లు అర్జున్ మొదటి సినిమా ‘గంగోత్రి’లో ‘వల్లంకి పిట్ట’ పాటలో చిన్నప్పటి కథానాయికగా కనిపించిన కావ్య క‌ళ్యాణ్ రామ్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ వస్తే కానీ అన్నం తినని, అల్లు అర్జున్ పాట పాడితే కాని నిద్రపోని పాత్ర‌లో కావ్య అద్భుతంగా న‌టించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చిన కావ్య ఎంతోమంది హీరోల సినిమాలలో నటించింది. ‘బాలు, అడవిరాముడు, అందమైన మనసులో, విజయేంద్రవర్మ’ చిరంజీవి ఠాగూర్, వంటి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది.

పుణెలో “లా” పూర్తి చేసిన ఈ పాప ఇప్పుడు సినిమాల వైపు దృష్టి పెట్టింది. అంతేకదౌ తెలుగుతో పాటు తమిళ, మళయాళ సినిమాలకు కూడా ఆడిషన్స్ ఇస్తుంది. తెలుగు అమ్మాయిని కావడం అడ్వాంటేజ్‌గా ఫీలవుతుందట ఈ అర్జున్ బ్యూటీ. మన తెలుగు కల్చర్, నేటివిటీ అనేది హిందీ హీరోయిన్లకన్నా తెలుగు అమ్మాయిలకే అర్థమవుతుందని చెపిన ఈ అమ్మడు.. రియాలిటీకి దగ్గరగా ఉండే, ఇంట్రెస్టింగ్‌, ఛాలెంజింగ్‌ పాత్రలంటే ఇష్టం.. అలాంటి అవకాశం నాకు వచ్చి, పాత్ర ఆసక్తిగా అనిపిస్తే చేస్తాను అని చెప్పుకొచ్చింది.

అయితే సినిమాల క‌న్నా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ అల‌రిస్తుంది. కావ్య‌ని ఇలా చూసి అంతా షాక‌వుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news