Moviesబాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ జ‌న‌తా గ్యారేజ్‌... ఆ హీరో క‌న్‌ఫార్మ్‌..!

బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ జ‌న‌తా గ్యారేజ్‌… ఆ హీరో క‌న్‌ఫార్మ్‌..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 2016 లో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన ప్రేక్షకులతో పాటు విమర్శకులను సైతం మెప్పించింది. పైగా అదే యేడాది ఎన్టీఆర్‌కు నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ రూపంలో రెండు హిట్లు వ‌చ్చాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించగా నిత్యామీనన్.. స‌మంత‌ హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్ దగ్గర రు. 127 కోట్ల రూపాయలు కొల్ల‌గొట్టిన‌ జనతాగ్యారేజ్ ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్రముఖ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ఒక సినిమా నిర్మిస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

మైత్రి మూవీస్‌ వరుసగా క్రేజీ కాంబినేషన్లు సెట్ చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ హీరోగా ఒక సినిమా తెరకెక్కించేందుకు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఆ సినిమా ఏదో కాదు ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రీమేక్ అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం మైత్రీ సంస్థ సల్మాన్ ఖాన్ కు కేవలం అడ్వాన్స్ గానే రు. 25 కోట్లు ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. 2023 లో ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతోంది అని అంటున్నారు. మరి ఈ సినిమా దర్శకుడు, ఇతర విషయాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news