Moviesనాకు ఇష్టం లేదు రా బాబోయ్ అంటున్న నాని దగ్గర ఆ...

నాకు ఇష్టం లేదు రా బాబోయ్ అంటున్న నాని దగ్గర ఆ సినిమా బలవంతంగా చేయ్యించారట..తరువాత ఏం జరిగిందో చూడండి..!!

ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వారికీ నాని ఒక్కరు. ఆయన మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ‘అష్టాచమ్మా’ మూవీతో హీరోగా కెరీర్ ప్రారంభించిన నాని. ఇక తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకుని నేచురల్ స్టార్ గా మారిపోయాడుహిట్టు ఫ్లాపులతో పని లేకుండా టాలీవుడ్‌లో ఎప్పుడూ బిజీగా ఉండే హీరో నేచురల్ స్టార్ నాని. ఈయన చేతిలో కనీసం ఎప్పుడూ మూడు సినిమాలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఈయన మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు.

సాధారణంగా ఇండస్ట్రీలో నాని కథల ఎంపికపై చాలా నమ్మకం ఉంది. ఈయన ఓ కథ ఓకే చేసాడంటే కచ్చితంగా మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం అందరిలోనూ వచ్చేసింది. అయితే కొన్నిసార్లు ఆయన కూడా కథలను సరిగ్గా అంచనా వేయలేక వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. అనివార్య కారణాలతో కొన్ని సినిమాలు వదిలేస్తే.. మరికొన్ని డేట్స్ కుదరక వదిలేసాడు. అయితే నాని కెరీర్ లో ఓ సినిమా చెయ్యడానికి ఇష్టపడలేదంట.

కానీ బెల్లం కొండ సురేష్.. బలవంతంగా ఆ సినిమా చేయ్యించారట. అది ఏ సినిమా అనుకుంటున్నారా.. అదేనండి నాని రెండో సినిమాగా ”రైడ్” మూవీ. ఈ సినిమాలో తనీష్ మరో హీరోగా అక్ష – శ్వేతబసు ప్రసాద్ లు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో ప్రేక్షకుల నుండి ఆదరణ పొందింది. అంతేకాదు.. నానికి మాత్రం మంచి పేరు, గుర్తింపుని తీసుకొచ్చింది. కాగా.. అప్పట్లో ‘రైడ్’ సినిమా చేయనని చెప్పడానికి ఆయన ఆఫీస్ కు వెళ్తే బలవంతంగా తనతో ఆ సినిమా చేయించారని అన్నారు. ఆ సినిమా పెద్ద హిట్ అయిందని , కెరీర్ కి కూడా ఆ సినిమా బాగా ప్లస్ అయ్యిందని చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news