Gossipsఈ మేడం గారితో మేము సినిమా చెయ్యలేం రా బాబోయ్..మరీ ఇంత...

ఈ మేడం గారితో మేము సినిమా చెయ్యలేం రా బాబోయ్..మరీ ఇంత దారుణమా..??

వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన ఉప్పెన ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. త‌న మొద‌టి చిత్రంతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చేసిన మొదటి సినిమాతోనే ఆడియన్స్‌‌ని మేస్మైరైజ్ చేసింది ఉప్పెన భామ కృతిశెట్టి. కేవలం ఒకే ఒక్క సినిమాతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్నది కృతిశెట్టి. దీంతో టాప్ స్టార్స్ మొదలుకొని స్టార్ డైరెక్టర్ల చూపు ఇప్పుడు ఈ అమ్మాయి పైన పడింది. అంతేకాదు వ‌రుస‌గా ఆఫ‌ర్ల‌ను కొట్టేస్తుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ మూడు చిత్రాల్లో న‌టిస్తోంది.

కృతిశెట్టి పర్ఫార్మెన్స్‌ చూసి ఫిదా అయిన నాగార్జున.. ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వల్‌గా రాబోతున్న ‘బంగార్రాజు’ మూవీలో నాగార్జునతో పాటుగా నాగచైతన్య కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

నాగచైతన్య జంటగా కృతిశెట్టి తీసుకుంటే బాగుంటుందని నాగార్జున భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ రోల్ కోసం కొందరు హీరోయిన్లను పరిశీలించిన టీమ్.. నాగార్జున సూచన మేరకు కృతిశెట్టి వైపు మొగ్గు చూపుతున్నారట. అయితే, నాగచైతన్యకు జోడీగా బంగార్రాజు సినిమాలో నటించేందుకు గాను ఆమెను సంప్రదించగా ఏకంగా రెండు కోట్ల రూపాయల పారితోషికంను డిమాండ్‌ చేశారు అంటూ టాక్ వినిపిస్తుంది. సీనియర్‌ స్టార్‌ హీరోయిన్స్ రేంజ్ లో ఈ అమ్మడు పారితోషికం వసూళ్లు చేస్తున్న నేపథ్యంలో ముందు ముందు ఈమెతో సినిమా అంటే కష్టమే అన్నట్లుగా నిర్మాతలు భావిస్తున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news