Moviesస్టార్ యాంకర్ అనిత చౌదరి భర్త ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

స్టార్ యాంకర్ అనిత చౌదరి భర్త ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

అనితా చౌదరి.. ఈ పేరు వింటే అందరికీ ఛత్రపతి సినిమాలోని ఓ సీన్ గుర్తొస్తుంది. సూరీడు.. ఓ సూరీడు అంటూ అనితా చౌదరి చెప్పిన డైలాగ్, ఆ సీన్ ఎప్పటికీ గుర్తుంటుంది. అంతలా తెలుగు ప్రేక్షకుల మదిలో ముద్ర వేసిన ఆ సీన్.

జెమిని టివిలో రఘు తో కలిసి పోస్ట్ బాక్స్ నెంబర్ 1562 పేరిట ఓ ప్రోగ్రాం చేసిన యాంకర్ అనితా చౌదరి అంటే తెలియనివారుండరు. ఆడియన్స్ రాసిన ఉత్తరాలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చే ప్రోగ్రాం ఇది. అప్పట్లో జెమిని టివిలో అత్యధిక టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకున్న ప్రోగ్రాం ఇది. 16ఏళ్లకే అలా కెరీర్ స్టార్ట్ చేసి,ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడమే కాదు,ఈటివి,మాటివి,జి తెలుగు ఇలా అన్ని చానల్స్ లో కూడా యాంకర్ గా ఒక రేంజ్ లో తన ప్రోగ్రామ్స్ తో దూసుకెళ్లింది.

ఆతర్వాత వెండితెరపై అడుగుపెట్టిన అనిత సపోర్టింగ్ యాక్టర్ గా ఎన్నో సినిమాల్లో చేసింది. యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు అనితా చౌదరి. ‘నువ్వే నువ్వే’, ‘సంతోషం’ లాంటి సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. సంతోషం,మురారి,ఉయ్యాలా జంపాలా , రారండోయ్ వేడుక చూద్దాం, ఆనందం,నీ ప్రేమకై,నువ్వే నువ్వే వంటి ఎన్నో సినిమాల్లో చేసింది.

సీనియర్ యాంకర్‌గా రాణించిన అనితా చౌదరి నాన్న, రుతురాగాలు వంటి సీరియల్స్‌తో పాపులర్ అయ్యింది. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 100 పైగా చిత్రాల్లో నటించింది. ఛత్రపతి, నువ్వే నువ్వే, సంతోషం, రాజా, మన్మథుడు, మురారి వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఈమె కీలకపాత్రల్లో నటించారు. ఛత్రపతిలో ‘ఒరేయ్ సూరూడీ’ అంటూ ఈమె పలికించిన డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఇలా బుల్లితెర ,వెండితెరమీద మంచి పేరు తెచ్చుకున్న అనితా చౌదరి ఎన్నారై ని పెళ్ళాడి,ఇండస్ట్రీకి దూరమైంది. కొడుకు పుట్టడంతో అతడి కోసం ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకోవడంతో ఇండస్ట్రీకి దూరంగా జరిగింది.

భర్త అమెరికాలో ఉండడం వలన మొత్తం బుల్లితెరకు దూరంగా ఉంది. ఓ ఛారిటీ సంస్థ ద్వారా ఎంతోమందికి చేయూతనిస్తోంది. ఈమె భర్త ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అమెరికాలో ఉండికూడా తెలుగువారి కోసం యాంకరింగ్ చేస్తున్న ఈమె మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తుందా అని అడిగితె మంచి కథ దొరికితే నటించడానికి సిద్ధం అంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news