Moviesఈ బ్యూటీ మొదట సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం..!!

ఈ బ్యూటీ మొదట సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పట్లో స్టార్ హీరోయిన్ గా రాణించిన త్రిష గురించి తెలియనివారంటూ ఉండరు. ఆమె తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సౌత్ స్టార్ హీరోయిన్స్ లో త్రిష ఒకరు. త్రిష కృష్ణన్, ‘నీమనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయ్యింది.

ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన ‘వర్షం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకుంది. అంతేకాదు ఆ తర్వాత తెలుగులో అందరి అగ్ర హీరోల సరసన మెరిసింది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ చెన్నై చంద్రం.

త్రిష తెలుగు, తమిళ్, మలయాళం ఇలా అన్ని భాషల్లో ఎంతో అద్భుతంగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘కట్టా మీటా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి చెన్నై చంద్రం త్రిష అలాంటి ఈ భామ ఇటీవలే పరంభద అనే సినిమా తీసి ఓటిటిలో విడుదల చెయ్యగా ఆ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఇక త్రిష వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె 1983లో మే 4వ తేదీన జన్మించారు. చిన్నప్పటి నుండి సినిమాల మీద ఆసక్తి పెరగడంతో ఆమె మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఇక అలాంటి అందాల నటి ప్రస్తుతం ఒక సినిమాకు రెండు కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. కానీ ఈమె మొదటి సంపాదన ఎంతో తెలిస్తే మాత్రం అందరూ ఆశ్చర్యానికి గురవుతారు. ఇప్పడు ఇన్ని కోట్లా రెమ్యునరేషన్ తీసుకుంటున్న త్రిష మొదటి పారితోషికంగా..500 రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుందట.

త్రిష ఇండస్ట్రీలో హీరోయిన్ గా కాకముందు సైడ్ క్యారెక్టర్ లో నటించారు. అయితే త్రిష నటించిన ఆ సినిమాలోనే ఏకంగా 500 రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుందంట. అయితే ప్రస్తుత కాలంలో ఆ రెమ్యూనరేషన్ చాలా చిన్నది అయినప్పటికీ ఒకప్పుడు మాత్రం ఆ రెమ్యూనరేషన్ చాలా పెద్దది అని చెప్పుకొచ్చింది త్రిష.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news