Moviesఈ అందాల భామ సడెన్ గా సినిమాల నుంచి ఎందుకు తప్పుకుందో...

ఈ అందాల భామ సడెన్ గా సినిమాల నుంచి ఎందుకు తప్పుకుందో తెలుసా..??

స్నేహా ఉల్లాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగులో అడుగు పెట్టిన స్నేహా.. ఆ తర్వాత కరెంట్, సింహా లాంటి సినిమాల్లో నటించింది. ఒకట్రెండు విజయాలు వచ్చినా కూడా స్నేహాకు కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదు. ఆ తర్వాత పూర్తిగా అందాల ఆరబోతకే ఫిక్సైపోయింది ఈ ముద్దుగుమ్మ.

ఈమె ఇండస్ట్రీకి వచ్చినపుడు జూనియర్ ఐశ్వర్యా రాయ్ అన్నారు. పైగా సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా పరిచయం అయింది స్నేహా ఉల్లాల్. దాంతో ఈమెను అంతా లక్కీ అన్నారు. తెలుగు ఇండస్ట్రీకి ఉల్లాసంగా ఉత్సాహంగా వచ్చి ఇక్కడైనా స్టార్ అవుదాం అనుకుంటే.. ప్లాన్ వర్కవుట్ కాలేదు. బాలయ్య లాంటి హీరోతో సింహా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినా కూడా స్నేహా ఉల్లాల్ జాతకం మారలేదు.

కొద్ది కాలం క్రితం వరకు స్నేహా ఉల్లాల్ పేరు టాలీవుడ్‌లో బాగానే వినిపించేది.ఐశ్వర్యరాయ్ పోలికలు ఉండటంతో.. తొలి సినిమాలోనే సల్మాన్ ఖాన్ వంటి బడా హీరో సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్న స్నేహ ఉల్లాల్ కు.. ఆ తరువాత సరైన సక్సెస్ లు రాలేదనే చెప్పాలి. బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడంలో ఫెయిలైంది. టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసిన స్నేహ ఉల్లాల్.. ఆ తరువాత మాత్రం కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయింది.

ఇక చివరిసారిగా ఈమె 2014లో “అంతా నీ మాయలోనే” అనే సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత సినిమాలకు దూరం అయింది దానికి గల కారణం ఏమిటంటే.. “ఆటో ఇమ్యూన్ డిజార్డర్”అనే వ్యాధి ద్వారా ఆమె చాలా బాధ పడుతోందని ఒక ప్రముఖ వార్తా పత్రికలో ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక అంతే కాకుండా రోగనిరోధకశక్తి సరిగ్గా పనిచేయకపోవడంతో, ఆమె సినిమాలలో నటించలేదు.

ఇక అంతే కాకుండా కనీసం 30 నిమిషాల పాటు కూడా నిలబడ లేకుండా ఉండే దానిని అని స్వయంగా ఆమె తెలిపింది. అందుకోసమే ఈ వ్యాధి బారి నుండి బయటపడడానికి చికిత్స తీసుకున్నాను అని తెలిపింది. ఇక ఈ చికిత్స అనంతరం ఈమె ఇప్పుడు బాగున్నాను అని తెలిపింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news