Moviesముద్దు పెడుతూ..భర్తకు మెగా డాటర్ ఏం చెప్పిందో తెలుసా..??

ముద్దు పెడుతూ..భర్తకు మెగా డాటర్ ఏం చెప్పిందో తెలుసా..??

టాలీవుడ్ లో ఇప్పటి వరకు మెగా హీరోలు వస్తున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లో ఏకంగా ఓ క్రికెట్ జట్టు టీంగా మెగా హీరోలు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి చిరు అల్లుడు స‌త్య‌దేవ్‌ వరకు 11 మంది హీరోలు ఫ్యామిలీ నుంచి ఉన్నారు. వీరిలో చాలా మందికి ప్రేక్షకులు మ‌ద్ద‌తు… అభిమానుల ఆశీస్సులు ఉన్నాయి. అందుకే వారంతా స్టార్ హీరోలు ఉన్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్…. నాగబాబు కుమార్తె నిహారిక మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయారు. ‘ఒకే మనసు’సినిమాతో మొదటి సారిగా మెగాబ్రదర్ కూతురు కొణిదెల నిహారిక హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మెగా ఫ్యామిలీ అభిమానుల సపోర్ట్ ఆమెకు ఏమాత్రం లేకుండా పోయింది.

హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న‌ ఆమెకు తన తండ్రి నాగబాబు ఎంత మాత్రం అడ్డుచెప్పలేదు. అన్న వ‌రుణ్‌తేజ్‌ కూడా ఎంక్రేజ్‌ చేశాడు. చివరకు మ‌రో అన్న రామ్‌చ‌ర‌ణ్‌, బావ అల్లు అర్జున్ కూడా ఆమె చిత్రాల వేడుకలకు వచ్చి మంచి ప్రమోషన్ ఇచ్చారు. అయితే సరైన క‌థ‌లు ఎంపిక చేసుకోవడంలో ఆమె ఫెయిల్ అవడంతో ఆమె కెరీర్ స్టార్టింగ్ లోనే సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నటించిన సినిమాలు ఏవి పెద్దగా హిట్ కాలేదు. ఇక, ఈ మధ్యనే చైతన్యను వివాహం చేసుకున్న ఆమె.. అతడితో లైఫ్‌ను సాఫీగా సాగిస్తోంది.

మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో ఎంత అల్లరి చేస్తుంది, ఆట పట్టిస్తుందో అందరికీ తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డతో వివాహాం అనంతరం నిహారిక సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు. భర్తతో కలిసి నిహారిక చేసే రచ్చ మామూలుగా ఉండదు. అయితే నిహారిక తన భర్త బర్త్ డే సందర్భంగా చేసిన పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నీహారిక తన పోస్ట్ లో ..”Happy Birthday Husband.. సినిమా సంగతుల్లో నీ వింత సెలక్షన్స్, నీ వంట ఎక్స్‌పరిమెంట్స్, నీ కాఫీ పిచ్చి, అర్దరాత్రి లేచి స్నాక్స్ తినడం, థీమ్ పార్టీలు చేయడంలో నీకున్న అంకిత భావం, నీ సిల్లీ రియాక్షన్స్, సైలెంట్‌గా బుద్దిమంతుడిలా ఉండటం, నీ ఓర్పు ఇలా ఓ భర్తకు కావాల్సిన అద్బుత లక్షణాలన్నీ ఉన్నాయి. ఈ జీవితానికి నీ లాంటి మంచి వ్యక్తి దొరకడం కంటే ఇంకేం కావాలి. నువ్ నా ప్రేమను కురిపిస్తున్న విధానానికి థ్యాంక్స్. నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను.. చేచు” అని పోస్ట్ చేసారు.

 

 

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news