Newsఅమ్మ బాబోయ్.. ఈ పిల్ల మామూలుది కాదండోయ్..!!

అమ్మ బాబోయ్.. ఈ పిల్ల మామూలుది కాదండోయ్..!!

అమ్ము అభిరామి ..ప్రస్తుతం ఈ అమ్మడు పేరు మారు మ్రోగిపోతుంది. ఎక్కడ విన్న.. ఎక్కడ చూసిన అమ్మడు పోస్టర్స్ నే కనిపిస్తున్నాయి.. అంతలా పాపులర్ అయ్యింది ఈ పాప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రియమణి కథానాయికగా సురేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం నారప్ప. ఈ రోజే అమెజాన్ ప్రైమ్ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఇతర పాత్రధారులు రాజీవ్ కనకాల కార్తీక రత్నం వంటి నటీనటులు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.

ఇది తమిళ హీరో ధనుష్ నటించిన అసురన్‌కు రీమేక్‌ అన్న విషయం మనందరికీ తెలిసిందే. వెంకటేష్ సరసన ప్రియమణి నటించగా అమ్ము అభిరామి అనే మరొక హీరోయిన్ కూడా నటించింది. అయితే అసురన్‌లో మరియమ్మలా, నారప్పలో కన్నమ్మలా ఇద్దరు హీరోలతో ఆడిపాడిన ఈ నటి అందరినీ తెగ అట్రాక్ట్‌ చేస్తోంది. దీంతో ప్రేక్షకులు ఈ నటి ఎవరంటూ గూగుల్‌లో తెగ సెర్చ్‌ చేస్తున్నారు.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈ అమ్మాయి అమ్ము అభిరామి .. సినిమాలలో నటించాలనే ఆసక్తితో తన చదువుకునే రోజుల్లోనే కొన్ని సినిమాలలో నటించి..అందర్ని మెప్పించి. ఇక ఆతరువాత ఆమె చాలా సినిమాలో అడపదడపా చిన్న పాత్రలు వేసుకుంటూ.. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన చిత్రం”రాక్షసుడు” లో మంచి లీ రోల్ చేసింది. ఇక ఈ సినిమాలో తన నటన చూసి తెలుగు ప్రజలు ఫిదా అయ్యారు. మంచి టాలెంట్ ఉండటంతో వెంకీ పక్కన ఛాన్స్ కొట్టెసింది ఈ బ్యూటి.

ఇక నారప్ప సినిమా లో ఆడపిల్లల విషయంపై అమ్మ అభిరామి చెప్పిన డైలాగ్ వల్ల చాలా ఫేమస్ అయ్యిపోయింది. ఇకపోతే ఈమె మణిరత్నం దర్శకత్వం లో “నవరస”అనే సినిమాలో కూడా ఒక లీడ్ పాత్రలో నటించనుంది. ఏదిఏమైనా అమ్ము అభిరామి ప్రస్తుతం బాగా పాపులారిటీని అందుకుంటోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news