Moviesమొగుడు పెళ్లాల మధ్యలో దూరిన మంచు లక్ష్మి..రిప్లై వింటే గూబ గుభేల్..!!

మొగుడు పెళ్లాల మధ్యలో దూరిన మంచు లక్ష్మి..రిప్లై వింటే గూబ గుభేల్..!!

ఉపాసన కామినేని… ఇప్పుడీ పేరుకి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతటా మంచి గుర్తింపు ఉంది. రామ్ చరణ్ సతీమణిగా తెలిసింది కొందరికే అయినా, అపోలో లైఫ్ వైస్ ఛైర్ పర్సన్‌గా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉపాసన కామినేని కొణిదెల ఆదుకున్నది ఎందరినో. ఉపాసన కొణిదెల…రామ్ చరణ్ భార్యగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు చిరంజీవి వారి కోడలుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నేడు ఈ మెగా కోడులు పుట్టినరోజు.

మెగాస్టార్ చిరంజీవి కోడలుగా.. అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలిగా ఉపాసనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు రామ్ చరణ్, ఉపాసన ఐదేళ్లు ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ఫ్యామిలీకి, అపోలో ప్రతాప్ రెడ్డి కుటుంబానికి మంచి పేరే ఉంది. ఉపాసన విషయానికొస్తే.. రామ్ చరణ్ భార్యగా మెగా ఫ్యామిలీతో మమేకైపోయింది. అంతేకాదు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడమే కాదు… తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.

భార్యపై ఎంతో ప్రేమగా ఉండే చెర్రీ.. ఈ ప్రత్యేకమైన రోజున ఆమెకు స్పెషల్ విషెస్ పోస్ట్ చేశారు. తన అర్ధాంగిపై ఉన్న అమితమైన ప్రేమను వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో సందేశం పెట్టారు. ఈ మేరకు భార్య తన భుజంపై వాలి ఉన్న ఓ ఫొటో షేర్ చేశారు రామ్ చరణ్. ఇంతవరకూ ఒకే గానీ ఈ దంపతుల మధ్యలో దూరి ఓ కామెంట్ వదిలింది మంచు లక్ష్మి. ఇక ఈ పోస్ట్ చూసిన మంచు లక్ష్మి.. “ఈ పిక్ తీసినందుకు నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు” అని కామెంట్ చేసింది. ఇక మన నెటిజన్స్ వదులుతారా..లేదుగా.. ఆమెను పటూకుని సోషల్ మీడియలో ట్రోల్స్ చేస్తున్నారు. ముందు ఉపాసనాకి విష్ చెయ్యి.. ఆతరువాత మాట్లాడు అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

 

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news