Moviesహరితేజ పాప పేరు ఏంటో తెలుసా..?? భళే ఉందే..!!

హరితేజ పాప పేరు ఏంటో తెలుసా..?? భళే ఉందే..!!

బుల్లితెర నటి, వెండితెర ఆర్టిస్ట్ హరితేజ గురించి తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలిసిందే. యాంకర్, డాన్సర్, యాక్టర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది హరితేజ. బిగ్ బాస్ షో తరువాత ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. తన నటనతో.. తెలివితో అభిమానులను సొంతం చేసుకున్న హరితేజ ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే హరితేజ.. తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది.

అయితే హరితేజ ఇటీవలి కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా డెలీవరి సమయంలో తాను పడిన కష్టాల గురించి హరితేజ చెప్పిన విషయాలు అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాయి. ఇప్పటి వరకు బిడ్డ ఫోటోలు చూపించని ఆమె ఈరోజు నామకరణం చేసి ఫోటో షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూతురి ఫొటోను షేర్‌ చేసింది కానీ అందులో పాప ముఖం మాత్రం క్లారిటీగా చూపించలేదు.

అయితే తాజాగా హరితేజ తన కూతురికి అదిరిపోయే పేరు పెట్టేశారు. కూతురికి భూమి దీపక్‌రావు అని నామకరణం చేసినట్లు వెల్లడించింది హరితేజ. అదేంటి పేరు కొత్తగా ఉందే అనుకుంటున్నారా..?? ఈ పేరుకు వివరణ కూడా ఇచ్చింది హరితేజ. ” భూమి అంటే చాలా సహనంతో ఉంటుందనుకుంటున్నారేమో.. కానీ వాళ్లకేం తెలుసు.. సహనాన్ని పరీక్షిస్తే భూకంపాలే ” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మొత్తానికి భూమిని ఎత్తుకున్న హరితేజ దంపతుల ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news