Moviesపెళ్లాం కొంగు చాటున క్రేజీ హీరోల పార్టీలు ?

పెళ్లాం కొంగు చాటున క్రేజీ హీరోల పార్టీలు ?

నటి నజ్రీయా నజీమ్‌.. టాలీవుడ్‌లో ఒక్క సినిమా చేయనప్పటికి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈ మళయాల భామ ‘రాజారాణి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. రాజా రాణి మూవీ ద్వారా అంద‌రినీ ఆక‌ట్టుకుంటోన్న న‌జ్రియా న‌జీమ్‌.. త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించిన ఈ భామ .. ఇప్పుడు తెలుగులోకి నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెర‌కెక్కిస్తోన్న “అంటే సుంద‌రానికి” మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నజ్రీయా తాజాగా తన భర్తతో, స్నేహితులతో ఉన్న ఫొటోల‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానుల‌తో పంచుకుంది. స్టార్ హీరో ఫహద్ ఫాసిల్- నజ్రియా జంట.. దుల్కర్ సల్మాన్ – అమల్ సుఫియా దంపతులు.. పృథ్వీరాజ్ – అతని భార్య సుప్రియా మీనన్ లు అంతా ఒకే చోట కలిసి డిన్నర్ చేసారు. దానికి సంబంధించిన ఓ ఫోటోని నజ్రియా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

సెలబ్రిటీ వరల్డ్ లో ఈ నైట్ పార్టీలు…లేట్ నైట్ డిన్నర్లు కామన్. షూటింగ్ లు లేక తీరిక సమయం దొరికితే స్నేహితులతో చిలౌట్ అయ్యేందుకు ఎక్కువగా ఇంట్రస్ట్ చూపుతుంటారు. తాజాగా ఈ మాలీవుడ్ మూడు జంటలు డిన్నర్ పార్టీ కోసం అంతా ఒక చోట కలిసారు. కానీ, కపుల్ పార్టీ వెన్యూ ఎక్కడ అన్నది చెప్పలేదు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ప్రస్తుతం ఈ మూడు జంటలు మలయాళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news