Movies"విక్రమార్కుడు" మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?

“విక్రమార్కుడు” మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?

విక్రమార్కుడు 2006 లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో రవితేజ, అనుష్క ముఖ్యపాత్రల్లో నటించారు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. ‘విక్రమార్కుడు’ సినిమా స్టోరి పాతదే. కానీ ఆ ఓల్డ్‌ థియరీనే గోల్డెన్‌ మూవీగా మార్చేశారు డైరెక్టర్‌ రాజమౌళి. అందుకే జనం ‘విక్రమార్కుడు’ కు జై కొట్టారు.

విక్రమ్ రాథోడ్ అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్.. చిల్లరమల్లర వేషాలేసే అత్తిలి సత్తిబాబు.. ఏమాత్రం పొంతన లేని ఈ రెండు క్యారెక్టర్లనీ కలిపి.. సాలిడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మూవీ విక్రమార్కుడు. రవితేజ కెరీర్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా విక్రమార్కుడు స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. అప్పటికే ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, వెంకీ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు రవితేజ.

అదిరిపోయే మార్కెట్ సొంతం చేసుకుని స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలోనే వచ్చింది విక్రమార్కుడు సినిమా. అప్పటి వరకు 20 కోట్ల మార్కెట్ లేని రవితేజకు ఈ సినిమాతో అది వచ్చేసింది. స్టార్ నుంచి సూపర్ హీరోగా మారిపోయాడు మాస్ రాజా. రాజమౌళితో రవితేజకు, అనుష్కకు ఇదే తొలి చిత్రం. ఈ సినిమా తరువాత రాజమౌళి ‘బాహుబలి’ సీరీస్ లో దేవసేనగా అనుష్క మంచి మార్కులు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

ఇక కీరవాణి సంగీతం ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పాలి. ‘జింతాక్ తాక్’ మరియు ‘జుం జుం మాయ’ వంటి పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా అతను అలరించాడు. అంతేకాదు తెలుగులో వచ్చిన తర్వాత 5 భాషల్లో రీమేక్ అయింది విక్రమార్కుడు. విక్రమార్కుడు’ చిత్రానికి రూ.11.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.18.95 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్లకు రూ.7.02 కోట్ల లాభాలు దక్కాయని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news