Moviesకాజ‌ల్ పెళ్లి వెన‌క ఇంత క‌థ న‌డిచిందా...!

కాజ‌ల్ పెళ్లి వెన‌క ఇంత క‌థ న‌డిచిందా…!

ముదురు ముద్దుగుమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా ఛాన్సులు వ‌స్తోన్న టైంలోనే త‌న చిన్న‌నాటి స్నేహితుడు గౌత‌మ్‌ను పెళ్లాడేసింది. ప్ర‌స్తుతం త‌న భ‌ర్త‌తో మాంచి రొమాంటిక్ ఫ్యామిలీ లై లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. త‌న భ‌ర్త‌తో రొమాంటిక్ మూడ్‌లో ఉన్న ఫొటోల‌ను ఆమె షేర్ చేస్తూ తాను ఎంత‌లా ఎంజాయ్ చేస్తోంది చెప్ప‌క‌నే చెపుతోంది. కాజ‌ల్ పెళ్లి వెన‌క చాలా క‌థే న‌డిచింద‌ట‌. త‌న పెళ్లి విష‌యంలో ఆమె ముందు నుంచి ఎక్కువ గాసిప్‌లు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌డంతో పాటు తాను ఎవ‌రిని పెళ్లాడుతోంద‌న్న‌ది ఆమె చెప్పేవ‌ర‌కు కూడా ఎవ్వ‌రికి క్లారిటీ లేకుండా పోయింది.

 

కాజ‌ల్ ఎంగేజ్‌మెంట్ జూన్‌లోనే చాలా సీక్రెట్‌గా జ‌రిగింద‌ట‌. అయితే ఈ విష‌యం ఏ మాత్రం బ‌య‌ట‌కు లీక్ కాకుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఈ ఫొటోల‌ను కాజ‌ల్ ఇప్పుడు త‌న అభిమానుల‌తో పంచుకుంది. ఆ ఎంగేజ్మెంట్‌లో కాజ‌ల్ ఎల్లో కలర్ డిజైనర్ వేర్ సారీలో కాజల్ మెరిపోతున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. దీనిని ప్ర‌ముఖ బాలీవుడ్ ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా డిజైన్ చేశార‌ట‌.

 

ఈ సంద‌ర్భంగా మ‌నీష్ మ‌ల్హోత్రా క్లిష్ట స‌మ‌యంలో ఇంత అద్భుతంగా ఈ శారీని డిజైన్ చేసినందుకు ఆమె మెచ్చుకుంది. నా ఎంగేజ్మెంట్‌లో మీరు భాగ‌స్వామ్యం అయినందుకు సంతోషిస్తున్నాను అంటూ ఆమె ప్ర‌శంస‌లు కురిపించింది. ఇక ఎంగేజ్మెంట్ అయ్యాకే కాజ‌ల్ ఆచార్య‌, భార‌తీయుడు 2 సినిమాల‌కు క‌మిట్ అయ్యింది. దీనికి కార‌ణం ఏంటంటే పెళ్ల‌యినా కూడా ఆమె సినిమాల్లో కంటిన్యూ అవుతాన‌న‌న్న సంకేతాలు ఇచ్చేందుకే ఇలా చేసింద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news