Sportsఐపీఎల్లో ప్లేఆఫ్ బెర్త్‌లు ఖ‌రారు... ఎవ‌రు ఎవ‌రితో అంటే...!

ఐపీఎల్లో ప్లేఆఫ్ బెర్త్‌లు ఖ‌రారు… ఎవ‌రు ఎవ‌రితో అంటే…!

ఐపీఎల్ ప్లే ఆఫ్ ద‌శ‌కు చేరుకుంటోన్న వేళ తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. ప్లే ఆఫ్ బ‌ర్త్‌ల విష‌యంలో ముందు రేసులో ఉన్న జ‌ట్లు చివ‌ర్లో వెన‌క ప‌డ‌గా… ముందు పాయింట్ల ప‌ట్టిక‌లో వెన‌క ఉన్న జ‌ట్లు ఆ త‌ర్వాత ప్లే ఆఫ్ రేసులోకి అనూహ్యంగా దూసుకు వ‌చ్చాయి. తాజాగా ఐపీఎల్లో ఢిల్లీ, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కు చేరుకున్నాయి. నిన్న బెంగ‌ళూరుపై గెల‌వ‌డంతో ఢిల్లీ ప్లే ఆఫ్‌కు చేరుకుంది. అయితే బెంగ‌ళూరు ఓడినా మెరుగైన ర‌న్ రేట్‌తో ప్లే ఆఫ్‌కు చేరుకుంది.

ఇక ముంబై పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో ఉండ‌డంతో ఇప్ప‌టికే ప్లే ఆఫ్‌కు చేరుకుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ ముంబైతో జ‌రిగే తొలి క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఈ రెండు జ‌ట్ల‌లో గెలిచిన టీం నేరుగా ఫైన‌ల్‌కు చేరుకుంటుంది. ఇక ఈ రోజు ముంబై – హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌లో ఎవ‌రు గెలుస్తార‌న్న దానిపైనే ప్లే ఆఫ్‌కు వెళ్లే నాలుగో టీం ఏ జ‌ట్టు అనేది డిసైడ్ కానుంది.

ఈ రోజు మ్యాచ్‌లో ముంబైపై హైద‌రాబాద్ గెలిస్తే శుక్ర‌వారం బెంగ‌ళూరుతో ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతుంది. ఒక వేళ ముంబై గెలిచి.. హైద‌రాబాద్ ఓడితే మాత్రం కోల్‌కతా, బెంగళూరు మధ్య ఎలిమినేషన్‌ మ్యాచ్‌ జరుగుతుంది. హైద‌రాబాద్ క‌థ ఐపీఎల్లో ఈ రోజుతో ముగుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news