చెడు అల‌వాట్ల‌తో కెరీర్ నాశ‌నం చేసుకున్న నిన్న‌టి తెలుగు పాపుల‌ర్ హీరోయిన్‌… !

ఒక‌ప్పుడు తెలుగులో పాపుల‌ర్ హీరోయిన్ అయిన ర‌చ‌నా బెన‌ర్జీ ఆ త‌ర్వాత ఆక‌స్మాత్తుగా సినిమాల‌కు దూర‌మైంది. ర‌చ‌నా బెన‌ర్జీ అంటే చాలా మందికి తెలియ‌దు ర‌చ‌నగానే ఆమె ఇక్క‌డ పాపుల‌ర్‌. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప‌క్క‌న బావ‌గారు బాగున్నారా సినిమాలో న‌టించిన ఆమె ఆ త‌ర్వాత ఇక్క‌డ ఎంతో మంది స్టార్ హీరోల‌తో ఎన్నో హిట్ సినిమాలు చేసింది. బెంగాలీ అమ్మాయి అయిన ర‌చ‌న ఆ త‌ర్వాత మోహ‌న్‌బాబు, వెంక‌టేష్‌, ర‌వితేజ‌, శ్రీకాంత్ లాంటి హీరోల‌తో మంచి హిట్ సినిమాలు చేసింది.

 

ఆ త‌ర్వాత అక‌స్మాత్తుగా ఇండ‌స్ట్రీకి దూర‌మైంది. కెరీర్ టాప్‌లో ఉన్న‌ప్పుడే ఆమె విప‌రీతంగా డ్రింకింగ్‌తో పాటు స్మోకింగ్‌కు అల‌వాటు ప‌డ‌డంతో ఆమె కెరీర్ దెబ్బ‌తింది. త‌ర్వాత అవ‌కాశాలు లేక చివ‌ర‌కు చిన్న చిన్న సినిమాల్లో కూడా సాయికుమార్ లాంటి హీరోల ప‌క్క‌న కూడా న‌టించింది. దీంతో ర‌చ‌న కుటుంబ స‌భ్యులు ఆమెను ప్రోబ‌ల్ బ‌సు అనే సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ త‌ర్వాత ఆమె కెరీర్ కాస్త ట్రాక్‌లోకి ఎక్క‌డంతో పాటు త‌న చెడు అల‌వాట్ల‌కు దూర‌మైంద‌ట‌.

 

పెళ్లి త‌ర్వాత ఓ బాబుకు జ‌న్మ‌నిచ్చిన ర‌చ‌న ఆ త‌ర్వాత కొన్ని సినిమాల్లో న‌టించింది. ఇప్పుడు కెరీర్‌పై దృష్టి పెట్టిన ర‌చ‌న ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లు వ‌స్తే తెలుగులో న‌టించేందుకు రెడీ అంటోంది. ఇక త‌న కొడుకుని బెంగాళీ భాష‌లో హీరోగా చేసేందుకు కూడా రెడీ అవుతోంది. ర‌చ‌న హీరోయిన్‌గా ఫాంలో ఉన్న‌ప్పుడు తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ళయాళం, హిందీ, ఒడియా భాష‌ల్లో మొత్తం 200కు పైగా సినిమాల్లో న‌టించింది.