Moviesరాధే శ్యామ్‌.. పూజా హెగ్డే ఫ‌స్ట్ లుక్‌లో అదే హైలెట్‌

రాధే శ్యామ్‌.. పూజా హెగ్డే ఫ‌స్ట్ లుక్‌లో అదే హైలెట్‌

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సాహో త‌ర్వాత న‌టిస్తోన్న సినిమా రాధే శ్యామ్‌. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌. తాజాగా ఆమె లుక్ రివీల్ చేశారు. యూర‌ప్ నేప‌థ్యంలో కొన్ని వంద‌ల ఏళ్ల క్రితం జ‌రిగిన క‌థాంశం నేప‌థ్యంలో తెర‌కెక్కే ఈ సినిమా రొమాంటిక్ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కుతోంది. ఈ ప్రేమ‌క‌థ‌లో పూజా ప్రేర‌ణ అనే అమ్మాయిగా క‌నిపించ‌నుంది.

 

ఇక తాజాగా రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్‌లో పూజా లోక‌ల్ ట్రైన్లో జ‌ర్నీ చేస్తున్న‌ట్టుగా ఉంది. అక్క‌డ యూర‌ప్ వాతావ‌ర‌ణాన్ని చ‌క్క‌గా ప్ర‌తిబింబించేలా చేశారు. పూజ ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ఇక పీరియాడిక‌ల్ క‌థాంశం నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్నందున క‌ల‌ర్ కాస్త డిఫ‌రెంట్‌గా ఉంది. ఏదేమైనా లుక్‌తోనే మ‌నం ఆ కాలంలోకి వెళ్లిపోయాం.

 

పోస్ట‌ర్‌లో గ్రీన‌రీ హైలెట్ చేయ‌డం బాగుంది. ఇప్ప‌టికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమాను వ‌చ్చే యేడాది విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాను గోపీక్రిష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news