Moviesఎన్టీఆర్ అభిమాని ట్వీట్‌కు ప్ర‌శాంత్ నీల్ రిప్లే... ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఎన్టీఆర్ అభిమాని ట్వీట్‌కు ప్ర‌శాంత్ నీల్ రిప్లే… ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వ‌స్తోన్న కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ బెంగ‌ళూరులో పూర్త‌య్యింది. గ‌త నెల‌లో షూటింగ్ ప్రారంభించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ బెంగ‌ళూరు షెడ్యూల్ పూర్తి చేసి హైద‌రాబాద్ షెడ్యూల్ కోసం ఇక్క‌డ‌కు వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌కు వ‌స్తున్నాన‌ని నీల్ చేసిన ట్వీట్‌తో ప‌లువురు తెలుగు సినీ అభిమానులు నీల్‌కు కేజీఎఫ్ 2 టీంకు స్వాగతం అంటూ ట్వీట్టర్ లో ఆహ్వానం పలికారు.

ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఎన్టీఆర్ అభిమానులు తార‌క్‌తో సినిమా ఎప్పుడు అని ప్ర‌శ్న వేశారు. ఓ అభిమాని అయితే హైద‌రాబాద్ వ‌చ్చాక కాల్ చేయండి అన్న తార‌క్ అన్న‌ను క‌లిసి క‌థ చ‌ర్చించేందుకు వెళ‌దాం అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన ప్ర‌శాంత్ నీల్ మీరు ట్వీట్ లో మీ నెంబర్ ఇవ్వడం మర్చిపోయారు అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ఇద్ద‌రి ట్వీట్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ప్ర‌శాంత్ నీల్ నెక్ట్స్ సినిమా ఎన్టీఆర్‌తోనే ఉంటుంద‌ని.. ఈ సినిమాను మైత్రీ మూవీస్ వారే నిర్మిస్తార‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తోన్న ఎన్టీఆర్ ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమా చేస్తాడు. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్‌తో సినిమా ఉంటుందంటున్నారు. ఇక నీల్ ఎన్టీఆర్ ఫ్యాన్ రిప్లేకు ఇవ్వ‌డంతో తార‌క్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news