Gossipsస్టార్ ప్రొడ్యుస‌ర్‌కు షాక్ ఇచ్చిన బ‌న్నీ... ఆ సినిమా క్యాన్సిల్‌..?

స్టార్ ప్రొడ్యుస‌ర్‌కు షాక్ ఇచ్చిన బ‌న్నీ… ఆ సినిమా క్యాన్సిల్‌..?

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు బ్యాన‌ర్లో ఐకాన్ – క‌న‌బ‌డుట‌లేదు అనే సినిమా ఎనౌన్స్ అయ్యింది. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంద‌ని ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. గ‌తేడాది బ‌న్నీ బ‌ర్త్ డే నాడు ఈ సినిమా ఎనౌన్స్ అయ్యింది. అయితే అప్ప‌టి నుంచి ఐకాన్ గురించి ఏ స‌మాచారం రాలేదు. బ‌న్నీ అల వైకుంఠ‌పురంలో సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు.

 

పుష్ప త‌ర్వాత కొర‌టాల శివ‌కు క‌మిట్ అయ్యాడు. కొర‌టాల శివ‌ది పాన్ ఇండియా సినిమా అంటున్నారు. ఐకాన్ క‌థ బ‌న్నీకి పూర్తిగా న‌చ్చ‌కుండానే దిల్ రాజు బ్యాన‌ర్‌ కావ‌డంతో మొహ‌మాటంతో ఒప్పుకున్నాడ‌ని అంటున్నారు. అయితే ఇప్పుడు తెలివిగా వేరే సినిమాలు ఒప్పుకుంటూ బ‌న్నీ ఐకాన్‌ను ప‌క్క‌న పెట్టేశాడంటున్నారు. అందుకే బ‌న్నీ ఈ సినిమాను సైడ్ చేసేశార‌ని గీతా కాంపౌండ్‌లో టాక్ వినిపిస్తోంది.

 

ఇక ఐకాన్ బ‌న్నీ చేసే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో దిల్ రాజు మ‌రో స్టార్ హీరోతో ఈ ప్రాజెక్టును ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడంటున్నారు. వ‌కీల్ సాబ్ కంప్లీట్ అయిన వెంట‌నే వేణు శ్రీరామ్ ఐకాన్ క‌థ‌లో మార్పులు చేసి వేరే హీరోలకు చెప్పాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఏదేమైనా బ‌న్నీ ఐకాన్ ఆగిపోవ‌డం దిల్ రాజుకు, బ‌న్నీ ఫ్యాన్స్‌కు షాకే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news